Site icon NTV Telugu

SSMB : సముద్రంలో సొరచేపలా సూపర్ స్టార్ మహేశ్ బాబు విన్యాసాలు

Ssmb 29

Ssmb 29

షూటింగ్‌కు ఏ మాత్రం గ్యాప్ దొరికిన సరే ఫారిన్ ఫ్లైట్ ఎక్కెస్తుంటాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. రాజమౌళితో సినిమా చేస్తున్న నేపథ్యంలో ఫారిన్ ట్రిప్ కు వెళ్లేందుకు తెరకలేకుండా పోయింది. ఒకానొక దశలో మహేశ్ బాబు పాస్‌పోర్ట్ కూడా లాక్కున్నాడు జక్కన్న. అప్పట్లో ఆ వీడియో వైరల్ గా మారింది. ఇటీవల షూటింగ్ కు కాస్త గ్యాప్ రావడంతో బాబు పాస్ పోర్ట్ ను తిరిగి ఇచ్చేసాడు జక్కన్న. దాంతో మళ్ళి విదేశీ పర్యటనలు మొదలు పెట్టాడు మహేశ్.

Also Read : Rashmika Mandanna : నేషనల్ క్రష్ ఖాతాలో రేర్ రికార్డ్`

గత కొద్ది రోజులుగా రాజమౌళి బాహుబలి ఎపిక్ పనుల్లో ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. దీంతో ఎస్ఎస్ఎంబీ 29 షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చారు. దాంతో వెంటనే ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్ వెకేషన్‌కు వెళ్లిపోయాడు సూపర్ స్టార్. వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్నఫోటోను తాజాగా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారింది. సముద్రం మధ్యలో సొరచేపలా సముద్రంలో ఎగిసిపడే అల‌ల మధ్య జర్నీ చేస్తూ కనిపించాడు. అందుకు సంబంధించిన ఫోటోలో మహేష్ ఫేస్ కనిపించకపోయినా.. ఈ పిక్ ను ఫాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ‘అద్భుతమైన ప్లేస్‌లో అద్భుతమైన అనుభవం. థాంక్యూ ఫర్ ద వండర్‌ఫుల్ స్టే! అంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చాడు సూపర్ స్టార్.  ఇక బాహుబలి ఎపిక్ పనులు ముగించిన జక్కన్న వచ్చే నెలలో SSMB29 సినిమా షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేయబోతున్నాడు.  అలాగే ఈ సినిమాకు సంబందించిన అధికారక ఈవెంట్ ను నిర్వచించి గ్లిమ్స్ కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి.

Exit mobile version