Site icon NTV Telugu

Super Star : రజినీకాంత్ సినిమా రిలిజ్.. ఆఫీసులకు సెలవు

Super Star

Super Star

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘వేట్టయాన్‌’. సూర్యతో జై భీమ్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు TJ జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బిగ్ బి అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా భాషలలో విడుదల కానున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిచింది. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్,లిరికల్ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసాయి. భారీ అంచనాల మధ్య ఈ నెల 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

Also Read : Rajnikanth : ‘వేట్టయాన్‌’ తెలుగులో డిజాస్టర్ బుకింగ్స్.. కారణం ఇదే..?

రజనీకాంత్ సినిమాలు రిలీజ్ అంటే తమిళనాడులో ఓ పండగ వాతావరణం ఉంటుంది. రిలీజ్ కు ముందు రోజు నుండే కటౌట్లు, పాలాభిషేకాలు, ఫ్యాన్స్ సందడితో చేసే రచ్చ అంత ఇంతా కాదు. అదేవిధంగా రజినీ సినిమా రిలీజ్ అంటే తమిళనాడులో ఆఫీసులకు హాలిడే ఇవ్వడం ఎప్పటినుండో సంప్రదాయంగా వస్తోంది, గతంలో సూపర్ స్టార్ నటించిన రోబో, శివాజీ, కబాలి రిలీజ్ టీమ్ లో చెన్నైలోని ప్రముఖ కంపెనీలు ఉద్యోగస్తులకు హాలిడే ప్రకటించాయి. అలా ఉండేది తమిళనాడులో రజనీ మ్యానియా. ఇక తలైవా నటించిన లేటేస్ట్ సినిమా ‘వేట్టయాన్‌’ మద్రాసు లో 656 షోస్ ( All Time Record) రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ ఫ్యాన్స్ లో అంచనాలను పెంచేసాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా కొన్ని కంపెనీలు హాలిడే ప్రకటిస్తూ లెటర్ రిలీజ్ చేసాయి. రజనీ స్టామినా అప్పటికి ఇప్పటికి ఎప్పటికి తగ్గదని అది మా హీరో స్టామినా అని తలైవర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version