స్టార్ హీరోయిన్ సమంత, బ్రిలియంట్ యాక్టర్ విజయ్ సేతుపతి నటించిన సినిమా ‘సూపర్ డీలక్స్’. తమిళంలో ఈ సినిమా విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందింది. త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్, సమంత అక్కినేని, రమ్యకృష్ణ, మిస్కిన్ ప్రధాన ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. విజయ్ సేతుపతి ట్రాన్స్ జండర్ గా నటిస్తే, రమ్యకృష్ణ పోర్న్ స్టార్ పాత్ర చేసింది. సమంత, ఫహద్ ఫాజిల్ భార్యభర్తలుగా నటించారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ‘సూపర్ డీలక్స్’ తెలుగు డబ్బింగ్ చిత్రాన్ని ఆగస్ట్ 6న ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
ఆహాలో సమంత ‘సూపర్ డీలక్స్’
