హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ ప్రాంతంలో ఉన్న లులు మాల్ వేదికగా నిన్న జరిగిన ‘ది రాజా సాబ్’ చిత్ర గీత ఆవిష్కరణ కార్యక్రమం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వేడుకకు హాజరైన నటి నిధి అగర్వాల్‌ను వందలాది మంది అభిమానులు, ఆకతాయిలు చుట్టుముట్టడం, ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసు యంత్రాంగం కఠినంగా స్పందించింది.
Also Read:Nidhi Aggarwal: మరీ ఇంత నీచమా.. ఏం మెసేజ్ ఇద్దామని?
నిధి అగర్వాల్‌కు ఎదురైన ఈ చేదు అనుభవంపై కేపీహెచ్‌బీ పోలీసులు సీరియస్ అయ్యారు. ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు మరియు అక్కడి పరిస్థితులను గమనించిన పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. సరైన భద్రతా ఏర్పాట్లు చేయకుండా, పరిమితికి మించి జనాన్ని అనుమతించినందుకు ఈవెంట్ నిర్వాహకులపై, మాల్‌లోకి వచ్చిన సెలబ్రిటీల భద్రతను పర్యవేక్షించడంలో విఫలమైనందుకు లులు మాల్ యాజమాన్యం మీద కేసు నమోదు చేశారు.
Also Read:Sitara – Akhanda 2 : అఖండ2లో పాత్ర కోసం సితార మొదలు సూర్య కూతురి దాకా?
అసలేం జరిగింది?
‘ది రాజా సాబ్’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు ప్రభాస్ అభిమానులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమం ముగిసిన తర్వాత నిధి అగర్వాల్ తన కారు వద్దకు వెళ్తున్న సమయంలో సెక్యూరిటీ వలయాన్ని దాటుకుని జనం ఆమెపైకి దూసుకువచ్చారు. కొందరు ఆమెను తాకడానికి ప్రయత్నించడం, మొబైల్ ఫోన్లతో ఆమె ముఖం వద్దకు రావడం వంటి చర్యలు వీడియోలలో స్పష్టంగా కనిపించాయి. తీవ్ర అసౌకర్యానికి లోనైన నిధిని బాన్సర్లు అతి కష్టం మీద కారు ఎక్కించారు. సాధారణంగా ఇలాంటి పబ్లిక్ ఈవెంట్లు నిర్వహించేటప్పుడు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడంతో పాటు, బాన్సర్లు, బారికేడ్ల ఏర్పాటు పక్కాగా ఉండాలి. కానీ, లులు మాల్ ఘటనలో ఈ నిబంధనలు గాలికి వదిలేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.