Site icon NTV Telugu

Asian Suniel : ఏషియన్ సునీల్ సంచలనం..ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడి పదవికి రాజీనామా

Suniel

Suniel

ఏషియన్ సునీల్‌గా తెలుగు సినీ వర్గాల్లో పాపులారిటీ సంపాదించిన నిర్మాత సునీల్ నారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిజానికి, ఆయన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా వరుసగా మూడవసారి నిన్న ఎన్నికయ్యారు. అయితే, తాజాగా ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఒక లేఖ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా, ఆయన తనకు సంబంధం లేకుండా తన పేరుతో పబ్లిక్ స్టేట్‌మెంట్‌లు ఇస్తున్నారని ఆరోపించారు. సినీ పరిశ్రమ నుంచి ఏదైనా పబ్లిక్ స్టేట్‌మెంట్ కానీ, ఇంటర్వ్యూ కానీ, ప్రెస్ మీట్ కానీ నిర్వహిస్తే, తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వడం లేదని వెల్లడించారు.

Also Read:Kannappa : కన్నప్ప.. ఆ నలుగురు ఎక్కడప్పా..?

ఈ క్రమంలోనే, ఇకమీదట ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలనుకోవడం లేదని, తన ఇన్వాల్వ్‌మెంట్ లేని విషయాల్లో మాటపడాలని అనుకోవడం లేదని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా కొనసాగలేనని, తనకు అవగాహన లేకుండా, తన ప్రమేయం లేకుండా ఇచ్చే స్టేట్‌మెంట్‌ల వల్ల తన పేరు పోగొట్టుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. కేవలం ఈ కారణంతోనే తాను అధ్యక్షుడిగా రాజీనామా చేస్తున్నానని ఆయన వెల్లడించారు.

Also Read:Prem Kumar : గుండెల్ని పిండే తమిళ డైరెక్టర్ స్ట్రైట్ తెలుగు సినిమా?

ఫిల్మ్ ఛాంబర్ తాను ఇచ్చిన ఈ లేఖను రాజీనామాగా పరిగణించాలని ఆయన కోరారు. అలాగే, తన తర్వాత మరొకరిని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా నియమించాలని కూడా కోరారు. గత కొద్ది రోజులుగా ఏషియన్ సునీల్ పేరు అనేక విషయాల్లో వార్తల్లోకి ఎక్కుతోంది. ముఖ్యంగా, పవన్ కళ్యాణ్ సినిమాపై కుట్ర చేసిన ఆ నలుగురిలో ఆయన కూడా ఒకరని వాదన ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో, ఇప్పుడు ఈ రాజీనామా లేఖ హాట్ టాపిక్‌గా మారింది.

Exit mobile version