Site icon NTV Telugu

Sundarakanda : మిడిల్ ఏజ్‌లో పెళ్లి క‌ష్టాలు.. నారా రోహిత్ ‘సుందరకాండ’ ఫన్నీ ట్రైలర్

Sundarakanda

Sundarakanda

టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్, కొంత గ్యాప్ తర్వాత మరోసారి వినూత్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. మిడిల్ ఏజ్ వయసులో పెళ్లి కష్టాలు, ఆ పరిస్థితే తీసుకువచ్చే హాస్యాస్పద సంఘటనలను ప్రధానాంశంగా తీసుకుని రూపొందిన ఆయన తాజా చిత్రం సుందరకాండ. రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా ఇలా ఆల్ ఇన్ వన్ ప్యాకేజీలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వెంకటేష్ నిమ్మల పూడి. శ్రీదేవి విజయ్‌కుమార్, వ్రితి వాఘని కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం.. వినాయక చవితి కానుకగా, ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రతి ఒక్క అప్ డేట్ మూవీపై మంచి అంచనాలు క్రియేట్ చేయగా.. తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌ను చూస్తే..

Also Read : Coolie : ‘కూలీ’ లో తన పాత్ర పై కింగ్ నాగ్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్..

మిడిల్ ఏజ్‌లో ఉన్న ఓ యువకుడికి పెళ్లి కష్టాలు ఎలా వస్తాయో, ఆ సన్నివేశాలను పూర్తిగా హాస్యభరితంగా చూపించారు. నారా రోహిత్ కామెడీ టైమింగ్, సిట్యూవేషనల్ హ్యూమర్ ఈ ట్రైలర్‌కి హైలైట్‌గా నిలిచాయి. చూస్తుంటే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ అని క్లియర్ గా తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం ఈ హిలేరియస్ ట్రైలర్ సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. రోహిత్ కెరీర్‌లో ఇది మళ్లీ లైట్ హార్ట్‌డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా నిలుస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయి. మరి ఈ వినాయక చవితి రేసులో సుందరకాండ ఎంత మేరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

 

Exit mobile version