Dheeraj Mogilineni: పెద్ద సినిమాలతో తలపడలేక ‘సమ్మర్ హాలిడేస్’ మళ్లీ వాయిదా..

Dheeraj Mogilineni

Dheeraj Mogilineni

Dheeraj Mogilineni: బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల పోటీకి తలొగ్గి చిన్న చిత్రాలు దారి వెతుక్కోవడం టాలీవుడ్‌లో కొత్తేమీ కాదు. ఇప్పుడు అదే పరిస్థితుల మధ్య ‘సమ్మర్ హాలిడేస్’ సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన అక్టోబర్ 30 తేదీన కాకుండా, నవంబర్ 6న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాత ధీరజ్ మొగిలినేని ప్రెస్ మీట్ వేదికగా ప్రకటించారు. పెద్ద సినిమాల రద్దీ వల్ల మంచి కంటెంట్‌తో తీసిన సినిమా దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. చిన్న చిత్రాలు ఎదుర్కొనే అసలైన సవాళ్లను బయటపెట్టారు. “మొదట అక్టోబర్ 9 లేదా 10న రావాలనుకున్నాం. అప్పుడు పెద్ద సినిమా ఉండటంతో అక్టోబర్ 30కి మారాం. కానీ ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి ఎదురైంది. మంచి సినిమా తీసినప్పుడు ప్రేక్షకులకు అది చేరడానికి థియేటర్లలో సరైన స్పేస్ కావాలి. థియేటర్ల దగ్గర రద్దీ ఎక్కువై మా సినిమా నష్టపోకూడదనే ఉద్దేశంతోనే నవంబర్ 6కి వాయిదా వేస్తున్నాం” అని అన్నారు.

చిన్న సినిమాలకు పబ్లిసిటీ బడ్జెట్, టైమ్‌లైన్స్ అన్నీ చాలా పరిమితంగా ఉంటాయని గుర్తుచేసిన ఆయన.. “మాకు పెద్ద చిత్రాల్లాంటి లగ్జరీ ఉండదు. నాలుగు రోజుల క్రితం విజయవాడ ఉత్సవాల్లోనూ అక్టోబర్ 30 అని ప్రచారం చేశాం. ఆ డేట్ అందరి మైండ్‌లో రిజిస్టర్ అయ్యాక, ఇప్పుడు మళ్లీ మార్చడం వల్ల బడ్జెట్ పరంగా చాలా ఇబ్బందిగా ఉంది. అయినా కంటెంట్‌పై ఉన్న నమ్మకంతోనే ముందడుగు వేస్తున్నాం” అని స్పష్టం చేశారు. ఈ చిత్రం గురించి సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారంపై కూడా ఆయన స్పందించారు. “ఇందులో రోహన్, అరుణ్ లీడ్ రోల్స్ చేసిన మాట నిజమే. కానీ ఇది కేవలం పిల్లల సినిమా మాత్రమే కాదు. ప్రతి ఒక్కరినీ వారి చిన్నతనానికి, అమ్మమ్మ ఊరి జ్ఞాపకాలకు తీసుకెళ్లే పక్కా నాస్టాల్జియా మూవీ. వేసవి సెలవులు, కజిన్స్‌తో గడిపిన రోజులు, వీధుల్లో ఫ్రెండ్స్‌తో కలిసి ఆడిన క్రికెట్.. ఇవన్నీ మనందరి జీవితాల్లో భాగమే. పెద్దలు థియేటర్‌కు వచ్చి బోర్ ఫీల్ అయ్యే ఛాన్సే లేదు, పిల్లలకంటే ఎక్కువగా పేరెంట్స్, యువత ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. రెండు గంటల పాటు ప్రతి ఒక్కరికీ వారి బాల్యాన్ని గుర్తుచేస్తామని మాటిస్తున్నాం” అని ధీరజ్ ధీమా వ్యక్తం చేశారు. నవంబర్ 6న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరించి, తమకు మంచి విజయాన్ని తెచ్చిపెడుతుందని టీమ్ నమ్ముతోంది.