Site icon NTV Telugu

Suma : రియల్ ఎస్టేట్ సంస్థ ఫ్రాడ్.. పెదవి విప్పిన సుమ!

Anchor Suma Raki Avenues

Anchor Suma Raki Avenues

Suma Responds on Raki Avenues Real Estate Fraud: రాజమండ్రిలో సుమారు 88 కోట్లు కొల్లగట్టి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో ఆ సంస్థకు ప్రమోషన్స్ చేసిన సుమ తమకు న్యాయం చేయాలని కొంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం మీద తాజాగా సుమ స్పందిస్తూ ఒక లేఖ విడుదల చేసింది. ఈ మేరకు ఈ లేఖను తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఆమె విడుదల చేసింది. అయితే తాను రాకీ అవెన్యూస్ అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు 2016 నుంచి 18 వరకు ప్రమోషన్ చేశానని అవి కేవలం అప్పటి వరకు మాత్రమే వాడుకోవాలని తాము అగ్రిమెంట్ చేసుకున్నామని చెప్పుకొచ్చింది. టైం ముగిసిపోయిన నేపథ్యంలో తనకు ఆ రాకీ ఎవెన్యూస్ అనే సంస్థకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేసింది.

Priya Bhavani Shankar: ఇండియన్ 2 ట్రోల్స్ చాలా ఇబ్బంది పెడుతున్నాయి.. ప్రియా భవానీ శంకర్ ఎమోషనల్

ఈ ప్రాబ్లం క్లియర్ చేసేందుకు తాను ఇందులో ఇన్వాల్వ్ అయిన అన్ని పార్టీలను లీగల్ గానే ఎదుర్కొంటానని అని చెప్పుకొచ్చారు. తాజాగా తనకు రాఖీ అవెన్యూస్ లో ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి లీగల్ నోటీసులు వచ్చాయని వాళ్లకు నేను సమాధానం లీగల్ గానే ఇచ్చి రాఖీ ఎవెన్యూస్ కి కూడా లీగల్ నోటీసులు పంపాను అని పేర్కొంది. అంతేకాక ఏదైనా అడ్వర్టైజ్మెంట్ లేదా ప్రమోషన్ అలాగే వీడియోలు అఫీషియల్ చానల్స్ నుంచి వస్తే మాత్రమే నమ్మాలని తాను విజ్ఞప్తి చేస్తున్నాను అని ఆమె చెప్పుకొచ్చింది. వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేయాలని కూడా తాను కోరుతున్నట్లు వెల్లడించింది. ఈ సమయంలో తనకు అండగా నిలిచిన వారికి కూడా ధన్యవాదాలు చెబుతూ ఆ నోట్‌లో స్పెషల్‌గా వారి గురించి కూడా మెన్షన్ చేసింది సుమ.

Exit mobile version