Niharika Konidela: సుడిగాలి సుధీర్ హీరోగా 25 కోట్ల సినిమా…కానీ?

సుడిగాలి సుధీర్ బుల్లితెరపై చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ. తాజాగా నిహారిక కొణిదెల నిర్మాణంలో రూపొందుతున్న ‘ఆట’ డాన్స్ షోకి సుధీర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ షోకి సంబంధించిన తాజా ఎపిసోడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ విశేషాలు ఇక్కడ చూద్దాం. సాధారణంగా డాన్స్ షోలలో జడ్జిల మధ్య లేదా కంటెస్టెంట్ల మధ్య చిన్నపాటి సరదా సంభాషణలు సహజం. కానీ, తాజా ఎపిసోడ్‌లో సుధీర్ రేంజ్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయికి వెళ్ళిపోయిందా? అనేలా చర్చ సాగింది. షో మధ్యలో నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. సుధీర్ హీరోగా తాను ఒక భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు కూడా వెల్లడించారు. తన తండి నాగబాబు చెప్పడంతో సుమారు 25 కోట్ల భారీ బడ్జెట్ తో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.

సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ కూడా ఈ షోలో జడ్జిగా ఉన్నారు. ఆమె సైతం సుధీర్‌తో మరో సినిమా అనౌన్స్ చేశారు. శరత్ కుమార్ కు సుధీర్ నచ్చడంతో తాము చేయబోయే ప్రాజెక్ట్ గురించి చెబుతూ, ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్లు వెల్లడించి సెట్‌లో కలకలం రేపారు. వరుసగా ఇద్దరు స్టార్ ప్రొడ్యూసర్లు ఆఫర్లు ఇవ్వడంతో సుధీర్ కాసేపు గాల్లో తేలిపోయారు. అయితే, వెంటనే తనదైన స్టైల్‌లో స్పందించిన సుధీర్.. తనకు ప్రస్తుతం చాలా బిజీ షెడ్యూల్ ఉందని, డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమని కేవలం నిహారిక సినిమాకి మాత్రమే తన డేట్స్ ఇస్తున్నానని, రాధిక ప్రాజెక్ట్ ప్రస్తుతానికి చేయలేనని చెప్పడంతో సెట్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. సుధీర్ ఒక సినిమాకు 25 కోట్ల బడ్జెట్, అనిరుద్, రెహమాన్ లాంటి దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్లు అనగానే ఫ్యాన్స్ కూడా కాసేపు నమ్మేశారు కానీ, ఇదంతా కేవలం షో రేటింగ్‌ కోసం, ప్రేక్షకులను అలరించడం కోసం నిహారిక మరియు రాధికా శరత్ కుమార్ కలిసి చేసిన ఒక ఇంట్రెస్టింగ్ ప్రాంక్ అని చివరలో తేలింది. ప్రస్తుతం ఈ ‘ఆట’ డాన్స్ షో ఎపిసోడ్‌కు సంబంధించిన క్లిప్పింగ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.