NTV Telugu Site icon

Sudheer Babu : ఓటీటీలో సుధీర్ బాబు చిత్రం ట్రెండింగ్..ఎక్కడంటే …?

Untitled Design (2)

Untitled Design (2)

టాలీవుడ్ న‌టుడు సుధీర్‌బాబుప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన‌ తాజా చిత్రం ‘హరోంహర ది రివోల్ట్‌’ అనేది ఉపశీర్షిక. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వ‌చ్చిన‌ ఈ సినిమాకు జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వహించాడు. సుధీర్ బాబుకు జోడిగా మాళవికా శర్మ కథానాయికగా న‌టించింది. సుమంత్‌ జి.నాయుడు  నిర్మించిన హరోం హర  జూన్ 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందన రాబట్టింది. అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు నష్టాలు మిగిల్చింది. ఇదిలావుంటే ఈ సినిమాను ఓటీటీలో జూలై 11న స్ట్రీమింగ్ చేయ‌బోతున్న‌ట్లు తెలుగు ఓటీటీ వేదికలు ‘ఈటీవీ విన్‌’తో పాటు ‘ఆహా’ ప్ర‌క‌టించాయి. కాని అనుకోని కార‌ణాల వ‌ల‌న ఓటీటీ విడుదల  వాయిదా ప‌డింది. ఫైనల్ గా అన్ని అవాంతరాలు దాటుకొని జూలై 18వ తేదీన ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేశారు ఈటీవీ విన్‌, ఆహా .

కాగా ఇటీవల తండ్రీకూతుళ్ల బంధంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్ర‌ణీత్ హ‌నుమంతు ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించాడు. దీంతో కొంత వివాదం రేగడంతో హీరో సుధీర్ బాబు వివరణ ఇస్తూ వీడియో రిలీజ్ చేసాడు. ఈ నేపథ్యంలో సినిమాలో ప్రణీత్ సీన్స్ క‌ట్ చేసి  ట్రిమ్ చేసిన వర్షన్ స్ట్రీమింగ్ చేసింది ఈటీవీ విన్‌, ఆహా. రెండు రోజుల గ్యాప్ తరువాత హరోంహర చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో కూడా స్ట్రీమింగ్ కు ఉంచారు. కాగా ప్రైమ్ లో ఈ చిత్రం ఇండియా నం.1గా ట్రేండింగ్ అవుతోంది. థియేటర్లలో అంతగా ఆకట్టుకొకున్న, ఓటీటీలో సుధీర్ బాబు చిత్రం  ట్రేండింగ్ పట్ల సంతోషం వ్యక్తం చేసింది నిర్మాణ సంస్థ. ఇంకెందుకు  ఆలస్యం పనిలో పనిగా మీరు ఓ సారి చూసేయండి.

Also  Read: Prabhas : మరో స్టార్ దర్శకుడితో మొదలెట్టిన రెబల్ స్టార్..!

Show comments