Site icon NTV Telugu

Sudheer Babu : వైలేన్స్ కాన్సెప్ట్‌తో సుధీర్ బాబు ..

Sudheer Babu

Sudheer Babu

ఇండస్ట్రీ ఏదైనప్పటికి ఈ మ‌ధ్య ర‌క్తం ఏరులై పారుతోంది. అంటే హింస‌ని ఊహించని విధ్ధంగా డిజైన్ చేసి మ‌రీ చూపిస్తున్నారు ద‌ర్శకులు. హీరో ఎన్ని త‌ల‌కాయ‌లు తెగ్గొడితే అంత క్రేజ్.. రీసెంట్ గా నాని ‘హిట్ 3’  మూవీ కూడా ఇదే కాన్‌సెప్ట్ పై వచ్చిందే. ఇది వ‌ర‌కు వ‌చ్చిన ‘కేజీఎఫ్‌’, ‘యానిమ‌ల్’, ‘మార్కో’, ‘స‌లార్‌’ సినిమాలు అని కూడా ఈ కంటెంట్ తో వచ్చే హిట్లు కొట్టాయి. దీంతో ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలు కూడా ర‌క్తపాతం చిందించ‌డానికి రెడీ అయ్యారు. ఇందులో భాగంగా సుధీర్ బాబు హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ #PMFxSB అనే ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఆర్‌.ఎస్‌. నాయుడు ద‌ర్శకత్వం వహిస్తున్నా ఈ ప్రాజెక్ట్ నుండి ఈ రోజు సుధీర్ బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

Also Read : Mother’s Day 2025: అలుపెరుగని శ్రమజీవి అమ్మకు.. స్పెషల్‌ విష్..!

ఈ పోస్టర్ ఓ మెట్ల మీద కుప్పలు తెప్పలుగా ప‌డి ఉన్న శ‌వాలు, వాటి మ‌ధ్య ష‌ర్టు లేకుండా, చేతిలో ఆయుధంతో న‌డుస్తూ సుధీర్ బాబు కనిపించాడు. ‘బ్రోకెన్ సోల్‌.. ఆన్ ఏ బ్రూట‌ల్ సెల‌బ్రేష‌న్‌’ అనేది క్యాప్షన్‌. దీన్ని బ‌ట్టి ఈ సినిమా క‌థేమిటో? వెండి తెర‌పై ఎలా ఉండ‌బోతోందో అర్థం చేసుకోవొచ్చు. పీపుల్ మీడియా నుంచి వ‌స్తున్న 51వ సినిమా ఇది. న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల వివ‌రాల్ని ప్రక‌టించ‌లేదు. త్వర‌లోనే షూటింగ్ మొద‌లు కానుంది. ఈలోగా వివ‌రాల‌న్నీ ఒకొక్కటిగా విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

 

Exit mobile version