NTV Telugu Site icon

Sudheer Babu : సుధీర్ బాబు పెళ్లి వేడుక ఛాలెంజ్ వీడియో చూసారా..?

Untitled Design (17)

Untitled Design (17)

. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. సరికొత్త కథలు ఎంచుకుంటున్నాడు కానీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా హీరో మహేష్ బాబు బావ సపోర్ట్ తో SMS చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ప్రేమ కథ చిత్రం. కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, హంట్, సమ్మోహనం వంటి విభిన్న సినిమాలు చేసాడు. ఇటీవలే హరోం హార సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు సుధీర్.

Also Read : Official : దేవర వరల్డ్ వైడ్ 2 డేస్ కలెక్షన్స్.. మాస్ ర్యాంపేజ్

ప్రస్తుతం మా నాన్న సూపర్ హీరో అనే చిత్రంలో నటిస్తున్నాడు. షియాజీ షిండే తండ్రి పాత్రలో మిడిల్ క్లాస్ కుర్రాడిగా కనిపించే పాత్రలో నటిస్తున్నాడు సుధీర్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 11న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం మూవీ ప్రమోషన్స్ ను ముమ్మరంగా చేస్తోంది. ఇందులో భాగంగా ఈ చిత్రం నుండి వేడుకలో అనే వెడ్డింగ్ సాంగ్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఇది నాకు చాలా ఇష్టమైన పాట, విన్న ప్రతిసారి నా పెళ్లి వేడుకలు గుర్తుకు వచ్చేవి, కాబట్టి ఆ అందమైన క్షణాలను మీతో పంచుకోవాలని అనుకున్నాను అని సుధీర్ బాబు తన పెళ్లి వీడియోను చిన్న గ్లింప్స్ గా కట్ చేసి తన ఇన్ స్టాలో షేర్ చేశారు. మహేష్ బాబు చెల్లెలలో ఒకరైన పద్మ ప్రియదర్శితో సుధీర్ బాబు పెళ్లి 2006లో ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఈ వీడియోలో వైరల్ గా మారింది.

Show comments