జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివల దేవర ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న భారీ ఎత్తున రిలీజ్ అయింది. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. తెల్లవారుజామున ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన దేవర సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. తారక్ నటన అనిరుధ్ మ్యూజిక్ సినిమాను వేరే లెవల్ కు తీసుకు వెళ్లాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను దేవర దండయాత్ర సాగుతుంది.
Also Read : Sankranti 2025 : సంక్రాంతి రేస్ నుండి తప్పుకున్న బాలయ్య – చిరు..?
కాగా దేవర మొదటి రోజు సేల్స్ ను అధికారకంగా ప్రకటించారు మేకర్స్. దాదాపు 7250 పైగా థియేటర్లలో విడుదలైంది దేవర. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 172 కోట్లు గ్రాస్ రాబట్టిందని పోస్టర్ రిలీజ్ చేశారు. నిన్న శనివారం వీకెండ్ కావడంతో దేవర 2వ రోజు కూడా సూపర్ కలెక్షన్స్ సాదించాడు. వరల్డ్ వైడ్ గా రెండవ రోజు రూ. 71 కోట్లు కొల్లగొట్టింది. మొత్తంగా రెండు రోజులకు గాను వరల్డ్ వైడ్ గా రూ. 243 కోట్లు రాబట్టిందని అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. ప్రీ రిలీజ్ బిజినెస్ లో 70% కలెక్షన్స్ రాబట్టాడు దేవర. నేడు అదివారం వీకెండ్ కారణంగా కలెక్షన్స్ రెండవ రోజు కంటే కాస్త ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఓవర్సీస్ లోనుదేవర చాలా స్ట్రాంగ్ గా కొనసాగుతుంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కు అతి చేరువలో ఉంది. ఈ వీకెండ్ ముగిసే నాటికీ బ్రేక్ ఈవెన్ దాటి లాభాలు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది.