NTV Telugu Site icon

Sudheer babu: హరోం హర ఓటీటీ విడుదల వాయిదా..?

Untitled Design (3)

Untitled Design (3)

నవ దళపతి సుధీర్ బాబు హీరోగా మాళవిక శర్మ హీరోయిన్ గా నటించిన చిత్రం హరోం హర. జ్ఞాన సాగర్ ద్వారక ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కుప్పం నేపథ్యంలో సాగిన ఈ చిత్రంపై సుధీర్ బాబు చాల నమ్మకం పెట్టుకొన్నాడు. జూన్ 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. దాంతో హిట్టు కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాలన్న సుధీర్ బాబు ఆశ సగంలో ఆగిపోయింది.

కాని ఈ చిత్రం ఓటీటీ రైట్స్ మంచి ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ సంస్థ ఈటీవీ నెట్ వర్క్, ఆహా సంయుక్తంగా హరోం హర నాన్ థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేసింది. కాగా చిత్రాన్ని ఈ రోజు ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కు ఉంచబోయితున్నట్టు కొద్ది రోజుల క్రితం అధికారకంగా ప్రకటన విడుదల చేసింది, ఈ చిత్రాన్ని ఓటీటీలో వీక్షించేందుకు ఎదురు చూసిన వారికి నిరాశే ఎదురైంది. రెండు ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవ్వలేదు. ఏవో కొన్ని టెక్నికల్  కారణాల వలన ఈ రోజు రిలీజ్ ఆగిపోయిందని న్యూస్ వినిపిస్తోంది. గతంలో కూడా ఆహా ఓటీటీ లో విడుదల సమయంలో ఇటువంటి తర్జన భర్జనలు జరిగాయి. సమ్యను పరిష్కరించి ఈ రోజు విడుదల చేస్తారో లేక మరో డేట్ ప్రకటిస్తారో చూడాలి. సుధీర్ బాబు కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్‌ జి.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. జయప్రకాశ్, రవి కాలే, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మణ్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. చేతన్ భరద్వాజ్ హరోంహర సినిమాకు స్వరాలు సమకూర్చారు.

 

Also Read : Kiran Abbavaram: ఆ సినిమా రైట్స్ కోసం పోటీ.. ఎవరికి దక్కేనో..?