NTV Telugu Site icon

SubbaRaju : నటుడు సుబ్బరాజు భార్య స్రవంతి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఇదే..

Subbaraju

Subbaraju

అసలు జీవితంలో పెళ్లి వద్దు అని గతంలో స్టేట్ మెంట్స్ ఇచ్చిన టాలీవుడ్ నటుడు సుబ్బరాజు మొత్తానికి ఒకింటివాడు అయ్యాడు. 47 ఏళ్ల వయసులో స్రవంతి అనే అమ్మాయితో సుబ్బరాజు పెళ్లి సింపుల్ గా జరిగింది. కేవలం ఇరు కుటుంబాలకు చెందిన బందు మిత్రులు, అతి కొద్దీ మంది మిత్రులు సమక్షంలో వీరి వివాహం అమెరికాలో హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. వేదమంత్రాల సాక్షిగా స్రవంతి మెడలో మూడు ముళ్ళు వేశారు సుబ్బరాజు. ఈ శుభసందర్భాన్ని ప్రేక్షకులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో ఫోటోలు రిలీజ్  చేయడంతో ఈ నూతన జంటకు విషెస్ తెలియజేస్తున్నారు నెటిజన్స్.

Also Read : Game Changer Third Single : గేమ్ ఛేంజర్ ‘నానా హైరానా’ లిరికల్ సాంగ్ రిలీజ్

కాగా సుబ్బరాజు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు అనే విషయమై అరాలు తీస్తున్నారు. సుబ్బరాజు భార్య గురించి ఇంకొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. సుబ్బరాజు భార్య పేరు స్రవంతి. ఈమె అమెరికాలోని ఫ్లోరిడాలో నార్త్వుడ్ డెంటల్ సెంటర్స్లో డెంటిస్ట్గా పనిచేస్తున్నారు. కొలంబియా యూనివర్సిటీ, జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ నుంచి బీడీఎస్, డీడీఎస్, ఎంపీహెచ్ డిగ్రీ పట్టా పొందారు స్రవంతి. ఆమె ఒక ఫిట్నెస్ ఫ్రీక్. అలాగే స్రవంతికి సైన్స్ పట్ల విపరీతమైన ఇష్టమట.చాలా ఏళ్ల క్రితం స్రవంతి ఫ్యామిలీ అమెరికాలో ఫ్లోరిడాలో స్థిరపడింది. ఆడంబరాలకు దూరంగా ఉండే సుబ్బరాజు తన వివాహాన్ని కూడా చాలా సింపుల్ గా చేసుకున్నారు. పెళ్లి అమెరికాలో చేసుకున్నప్పటికీ త్వరలో హైదరాబాద్ లో వీరి రిసెప్షన్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు సుబ్బరాజు. సుబ్బరాజు, స్రవంతి పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఆ పెళ్లి ఫొటోలను మీరు కూడా చూసేసి ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలపండి.

Show comments