Jailer 2 : ‘జైలర్ 2’ క్యామియో రోల్‌ను రిజెక్ట్ చేస్తున్న స్టార్స్..

Jailer 2

Jailer 2

సూపర్‌స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ జైలర్ 2. మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టించిన తెలిసిందే. ‘జైలర్ 1’ విజయంలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ వంటి స్టార్ హీరోల క్యామియో రోల్స్ కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు ఈ సీక్వెల్‌లో కూడా ఆ ఇద్దరి పాత్రలను కొనసాగిస్తూనే అంతకు మించిన ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యామియో పాత్రను నెల్సన్ ప్లాన్ చేశారు. అయితే ఈ స్పెషల్ క్యారెక్టర్ కోసం మేకర్స్ సంప్రదించిన పలువురు స్టార్ హీరోలు నో చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ పవర్‌ఫుల్ ఏపీ పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం దర్శకుడు నెల్సన్ మొదట టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణను సంప్రదించారు. రజనీకాంత్‌తో ఉన్న పాత అనుబంధంతో బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తారని భావించినా డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ కాంబో సెట్ కాలేదని ఫిలిం నగర్ టాక్. ఆ తర్వాత ‘బాద్‌షా’ షారూఖ్ ఖాన్‌ను సంప్రదించారు. కానీ షారూఖ్ తన రాబోయే చిత్రం ‘కింగ్’ షూటింగ్ షెడ్యూల్స్ మరియు లుక్ మార్పుల వల్ల ఈ ఆఫర్‌పై పెద్దగా ఆసక్తి చూపించలేదు. బాలయ్య, షారూఖ్ ఖాన్‌లతో పాటు పవన్ కళ్యాణ్‌ను కూడా అనుకున్నప్పటికీ ఆయన రాజకీయ బిజీ వల్ల కుదరలేదు. దీంతో ఈ క్రేజీ క్యామియో కోసం మేకర్స్ ప్రస్తుతం బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్‌ను సంప్రదించినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నాయి. ఒకవేళ హృతిక్ ఈ ప్రాజెక్ట్‌కు సైన్ చేస్తే దాదాపు 40 ఏళ్ల తర్వాత రజనీకాంత్, హృతిక్ రోషన్ ఒకే స్క్రీన్‌పై కనిపించినట్లవుతుంది. 1986లో వచ్చిన ‘భగవాన్ దాదా’ చిత్రంలో రజనీకాంత్‌కు కొడుకుగా బాలనటుడి పాత్రలో హృతిక్ నటించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారీ స్థాయిలో విడుదల కానున్న ‘జైలర్ 2’లో హృతిక్ ఎంట్రీ ఇస్తే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

×
×
Ad