Jailer 2 : ‘జైలర్ 2’ క్యామియో రోల్‌ను రిజెక్ట్ చేస్తున్న స్టార్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్‌స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’. మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టించిన తెలిసిందే. ‘జైలర్ 1’ విజయంలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ వంటి స్టార్ హీరోల క్యామియో రోల్స్ కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు ఈ సీక్వెల్లో కూడా ఆ ఇద్దరి పాత్రలను కొనసాగిస్తూనే అంతకు మించిన ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యామియో పాత్రను నెల్సన్ ప్లాన్ చేశారు. అయితే ఈ స్పెషల్ క్యారెక్టర్ కోసం మేకర్స్ సంప్రదించిన పలువురు స్టార్ హీరోలు నో చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ పవర్ఫుల్ ఏపీ పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం దర్శకుడు నెల్సన్ మొదట టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణను సంప్రదించారు. రజనీకాంత్‌తో ఉన్న పాత అనుబంధంతో బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తారని భావించినా డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ కాంబో సెట్ కాలేదని ఫిలిం నగర్ టాక్. ఆ తర్వాత ‘బాద్షా’ షారూఖ్ ఖాన్‌ను సంప్రదించారు. కానీ షారూఖ్ తన రాబోయే చిత్రం ‘కింగ్’ షూటింగ్ షెడ్యూల్స్ మరియు లుక్ మార్పుల వల్ల ఈ ఆఫర్‌పై పెద్దగా ఆసక్తి చూపించలేదు. బాలయ్య, షారూఖ్ ఖాన్‌లతో పాటు పవన్ కళ్యాణ్‌ను కూడా అనుకున్నప్పటికీ ఆయన రాజకీయ బిజీ వల్ల కుదరలేదు. దీంతో ఈ క్రేజీ క్యామియో కోసం మేకర్స్ ప్రస్తుతం బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్‌ను సంప్రదించినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నాయి. ఒకవేళ హృతిక్ ఈ ప్రాజెక్ట్‌కు సైన్ చేస్తే దాదాపు 40 ఏళ్ల తర్వాత రజనీకాంత్, హృతిక్ రోషన్ ఒకే స్క్రీన్‌పై కనిపించినట్లవుతుంది. 1986లో వచ్చిన ‘భగవాన్ దాదా’ చిత్రంలో రజనీకాంత్‌కు కొడుకుగా బాలనటుడి పాత్రలో హృతిక్ నటించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారీ స్థాయిలో విడుదల కానున్న ‘జైలర్ 2’లో హృతిక్ ఎంట్రీ ఇస్తే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!