ఈ మధ్యకాలంలో కధానాయికల ఆలోచన విషయంలో చాలా మార్పు వచ్చింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పటి కూడా వారి పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేస్తున్నారు. మొదట్లో హీరోయిన్స్ పెళ్లి పిల్లలు .. అయితే ఛాన్స్‌లు తగ్గిపొతాయి అనే ఉద్దేశంతో ముపై దాటిన వివాహా బంధం లోకి అడుగు పెట్టేవారు కాదు. కానీ ఇప్పుడు నటిమనులు మాత్రం అలా కాదు కెరీర్ కంటే వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలా ఈ మధ్య కాలంలో చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్ లు పెళ్ళి బందం లోకి అడుగుపెట్టి.. వెంటనే శుభవార్త కూడా చెబుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ స్టార్ కపుల్స్ కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా కూడా తాము తల్లిదండ్రులు కాబోతున్నాం అంటూ గుడ్ న్యూస్‌ని షేర్ చేసుకున్నారు. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పుడు ఒక బిడ్డకు జన్మనివ్వబోతుంది.
Also Read: Tamannaah : ప్రేమించే వ్యక్తిని జాగ్రత్తగా ఎంచుకోండి..
అయితే ఇండస్ట్రీలో ఆమె భర్త కన్నా కియారానే హీరోయిన్‌గా బాగా పాపులర్ అయిందన విషయం మనకు తెలిసిందే. కాగా ప్రజంట్ కియారా చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. కానీ తల్లి కాబోతున్న కారణంగా ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రాలు మినహాయిస్తే మిగతా సినిమాల నుంచి తప్పుకుంది కియారా. అంతేకాదు త్వరలోనే మొదలు కావాల్సిన ‘డాన్ 3’ సినిమాని కూడా వదులుకుంది. దీంతో ఆమె స్థానంలో మరో హీరోయిన్ ని తీసుకోనున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం కియారా అద్వానీ మరో రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉంటుందట. బాబు లేదా పాప పుట్టిన తర్వాత కొంత విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత రీ ఎంట్రీ ఉంటుంది అని ఆమె టీం చెబుతోంది. ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుంది.
