Site icon NTV Telugu

Star Hero : ప్లాప్ దర్శకులకు పిలిచి మరి అవకాశాలు ఇస్తున్న స్టార్ హీరో

Tollywood

Tollywood

ఇంతటి స్టార్ డైరెక్టర్ అయిన సరే ప్లాప్ వస్తే ఆ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చేందుకు వెనుకాముందు ఆలోచిస్తుంటారు హీరోలు. అలాంటిది తలైవన్ తలైవితో హిట్ ట్రాక్ ఎక్కిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి వరుసగా ప్లాప్ దర్శకులకు ఛాన్స్ ఇస్తున్నాడు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలతో డిజాస్టర్ చూసిన పూరీ జగన్నాథ్ స్టోరీ నచ్చి ఠక్కున ఓకే చెప్పిన ఈ వర్సటైల్ యాక్టర్.. ఇప్పుడు మరో ఫేడవుట్ దర్శకుడ్ని లైన్లో పెట్టినట్లు సమాచారం. ఒకప్పుడు అజిత్ లాంటి హీరోకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన శివతో మూవీకి కమిటైనట్లు కోలీవుడ్ టాక్.

రజనీకాంత్ అన్నాత్తే, సూర్యతో మూడేళ్ల పాటు ప్రయోగం చేసిన కంగువా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఈ రెండు డైరెక్టర్ శివ మేకింగ్ అండ్ టేకింగ్‌పై డౌట్స్ పడేలా చేశాయి. ఇక కోలీవుడ్ స్టార్స్ హ్యాండ్ ఇవ్వడంతో చివరి ఆప్షన్ కింద విజయ్ సేతుపతిని ఎంచుకున్నాడు. మక్కల్ సెల్వన్ జస్ట్ స్టోరీ చెబితే స్క్రిప్ట్ మొత్తం వినిపించాలన్న కండిషన్ పెట్టాడట. దీంతో ఆ ప్రిపరేషన్‌లో ఉన్నాడట ఈ డైరెక్టర్. ఈ దర్శకుల సంగతి పక్కన పెడితే సైకోతో బ్లాక్ బస్టర్ చేసిన మిస్కిన్ డైరెక్షన్ ల ట్రైన్.. అలాగే పిశాచు2లో ఓ చిన్న రోల్ చేశాడు విజయ్ సేతుపతి. కానీ ఈ సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదు. ఈ ఏడాదే వస్తాయని అనుకున్నప్పటికీ డిలే అవుతూనే ఉన్నాయి. పిశాచు2 ఫైనాన్షియల్ ఇష్యూస్, ట్రైన్ పోస్ట్ ప్రొడక్షన్ వల్ల డిలే అవుతున్నాయి. మరీ ఇవి ఎప్పుడు థియేటర్లలోకి వస్తాయో. పూరీ ప్లాప్ పరంపరకు మక్కల్ సెల్వన్ బ్రేకులేస్తాడో లేదో.

Exit mobile version