ప్రజంట్ బాలీవుడ్ నుండి విడుదలకు సిధ్ధంగా ఉన్న చిత్రాలు ‘జాట్’, ‘సికిందర్’. ఈ రెండు చిత్రాలను సౌత్ డైరెక్టర్ లే తెరకెక్కించడం విషేశం. తాజాగా విడుదలైన ఈ రెండు మూవీస్ ట్రైలర్స్ చూస్తుంటే..యక్షన్‌తో నింపేశారు. దీంతో ఇప్పుడు బాలీవుడ్ లో వీరి పేర్లే బాగా వినిపిస్తున్నాయి. బాలయ్యతో వీరసింహారెడ్డి తీసిన గోపీచంద్ మలినేని ‘జాట్’తో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. అయితే ఈ సినిమాను రవితేజ తో తీద్దామనుకుంటే.. బడ్జెట్ రూ.100 కోట్లు దాటింది. వర్కవుట్ కాదని.. సన్నీ డియోల్‌తో తీశాడట గోపీచంద్. ‘దర్2’ హిట్‌తో ఫామ్‌లోకి వచ్చిన సన్నీ డియోల్ నటిస్తున్న ఈ ‘జాట్’ ఏప్రిల్ 10న రిలీజ్ అవుతోంది. ఇక ‘సికిందర్’ విషయానికి వస్తే..
Also Read: Sonu Sood : సోనూసూద్ భార్యకు తృటిలో తప్పిన ప్రమాదం
వరుస ఫ్లాపుల్లో వున్న సల్మాన్‌ఖాన్.. తమిళ డైరెక్టర్ మురగదాస్‌ను నమ్ముకుని ‘సికిందర్’లో నటించాడు. రంజాన్ సందర్భంగా ఈ నెల30న రిలీజ్ అవుతున్న సందర్భంగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కూడా అంతా యాక్షన్‌తో ఈక్వెల్‌గా సెంటిమెంట్‌ను జోడించాడు దర్శకుడు. ఇక మనవాళ్లు తీస్తున్న యాక్షన్ మూవీస్ హిందీ ఆడియన్స్‌కు నచ్చడంతో.. బాలీవుడ్ స్టార్ సౌత్ డైరెక్టర్సే కావాలంటున్నారట. సందీప్ వంగా తీసిన ‘యానిమల్’ లో వైలెన్స్ ఎక్కువైనా..రొమాన్స్.. నాన్న సెంటిమెంట్‌తో సినిమాను బ్లాక్ బస్టార్ చేశారు. అలాగే షారూక్ ఖాన్ కెరీర్‌లో టాప్ గ్రాసర్ సాధించిన ‘జవాన్’ మూవీ కూడా తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో రూపొందింది. ఇందులో లవ్ అండ్ రొమాంటిక్ హీరో షారూక్‌ను యాక్షన్ హీరోగా మార్చేశాడు. ఈ రెండు సినిమాలు హిట్ తో, సౌత్ డైరెక్టర్స్‌పై నమ్మకం పెరిగిపోయింది. దీంతో వరుస ఆఫర్స్ ఇచ్చేస్తున్నారు బాలీవుడ్ హీరోలు.