NTV Telugu Site icon

Dj Tillu : సైలెంట్ గా పని కానిచ్చేసిన సిద్దు జొన్నలగడ్డ.. మరో బొమ్మరిల్లు..

Untitled Design (15)

Untitled Design (15)

సిద్ధు జొన్నలగడ్డ.. రీసెంట్‌గా డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్ టిల్లు స్క్వేర్తో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈయ‌న క‌థాయ‌కుడిగా బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘జాక్’ ‘కొంచెం క్రాక్’  అనేది ట్యాగ్ లైన్. విల‌క్ష‌ణ‌మైన సినిమాలు చేయ‌టానికి ఇష్ట‌ప‌డే సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కాంబోలో మ‌రో కొత్త జోన‌ర్ మూవీగా జాక్ తెర‌కెక్కుతోంది. ఎప్పుడో ప్రకటించిన ఈ సినిమా ఆడియెన్స్‌కు ఓ స‌రికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను అందించే చిత్రంగా రూపొందుతోంది. శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ బివిఎస్ఎన్‌.ప్ర‌సాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. హైద‌రాబాద్‌లో జ‌రుగుతోన్న షెడ్యూల్‌లో ప్ర‌కాష్‌రాజ్‌, న‌రేష్‌, బ్రహ్మాజీ త‌దిత‌రుల‌తో హిలేరియ‌స్ కామెడీ స‌న్నివేశాలను చిత్రీక‌రిస్తున్నారు. వీరితో పాటు సిద్ధు తిరుగులేని కామెడీ టైమింగ్ ప్రేక్ష‌కుల‌కు తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందించ‌నుంది.

Also Read: Devara : దేవర ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. దూకే ధైర్యమ జాగ్రత్త..

ఇప్ప‌టి వ‌ర‌కు 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. నేపాల్‌లో త‌దుప‌రి షెడ్యూల్‌ను చిత్రీక‌రించటానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌ను సెప్టెంబ‌ర్ 15 నుంచి ప్రారంభించ‌నున్నారు. అచ్చు రాజ‌మ‌ణి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. స‌రికొత్త జోన‌ర్‌, ఫ్రెష్ కామెడీ, వావ్ అనిపించే సౌండ్ ట్రాక్‌ను అచ్చు రాజ‌మ‌ణి సిద్ధం చేస్తున్నారు. సినిమాపై మంచి అంచ‌నాలున్నాయి. జాక్ చిత్రంలోసిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ టైటిల్ రోల్‌ను పోషిస్తున్నారు. త‌నే క్రాక్ గాడు ఎందుకుంటాడ‌నేదే తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌. లాఫింగ్ రైడ్‌లా సినిమా ఉంటుంది. బేబి సినిమా ఫేమ్ వైష్ణ‌వి చైత‌న్య ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుంది. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలిపారు.

Show comments