‘అల వైకుంఠపురములో’ తర్వాత బన్నీ నటిస్తున్న సినిమా ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని ప్రకటించారు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఈ రెండు భాగాల బడ్జెట్ రూ.250 కోట్ల వరకు ఉంటుందట. మొదటి భాగం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇక ఈ మాస్ ఎంటర్ టైనర్ లో మాస్ ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఉంటాయట. అందులో భాగంగా మాస్ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట సుకుమార్. ఈ పాటను స్టార్ హీరోయిన్ పై చిత్రీకరించటానికి ప్రయత్నిస్తున్నారు. రేసులో పూజా హెగ్డే, దిశా పఠానీ ఉన్నారని టాక్. సుకుమార్ గత చిత్రం ‘రంగస్థలం’లో జిగేలు రాణిగా స్పెషల్ సాంగ్ చేసి మైమరపించింది పూజా. సెటిమెంట్ తో ఆమెను రిపీట్ చేస్తారా? లేక కొత్తదనంతో పాటు బాలీవుడ్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో భాగం దిశా పటానీని రంగంలోకి దింపుతారా అన్నది తేలాల్సి ఉంది. మరి ఈ ఇద్దరిలో ఐటమ్ లో మెరిసేది ఎవరన్నది చూడాలి.
‘పుష్ప’ ఐటమ్ బేబీ ఎవరో!?
