NTV Telugu Site icon

Actor : పెంపుడు కుక్క కోసం కట్టుకున్న భార్యను వదిలేసిన స్టార్ యాక్టర్..

Untitled Design (70)

Untitled Design (70)

సెలబ్రెటిలకు బ్రెకప్‌లు, విడాకులు కామన్. కారణం చిన్నదైన కూడా వీడిపోతు ఉంటారు.ఇలాంటి వార్తలు బాలీవుడ్‌లో ఎక్కవగా వినిపిస్తూ ఉంటాయి. అయితే తాజాగా ఓ యాక్టర్ మాత్రం చాలా విచిత్రమైన కారణంతో విడాకులు తీసుకున్నాడు.

Also Read: 8 Vasanthalu : ‘8 వసంతాలు’ నుండి మోలోడి సాంగ్ రిలీజ్..

నటుడు అరుణోదయ్ సింగ్ గురించి పరిచయం అక్కర్లేదు. 2009లో ‘సికిందర్’ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, ‘యే సాలి జిందగీ’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘జిస్మ్ 2’, ‘మై తేరా హీరో’ , ‘మిస్టర్. ఎక్స్’, ‘మోహెంజో దారో’, ‘బ్లాక్‌మెయిల్’ వంటి సినిమాల్లో నటించగా, ‘అఫ్రాన్’ వెబ్ సిరీస్‌లో అతని నటనకు ప్రశంసలు దక్కగా, త్వరలో ‘శ్రీమాన్’ సినిమాలో కనిపించనున్నాడు. ఇలా కెరీర్ విషయంలో దూసుకుపోతున్న అరుణోదయ్ వ్యక్తిగత జీవితంలో మాత్రం వేనక పడిపోయాడు. తాజాగా తన భార్యకి విచిత్రమైన కారణంతో విడాకులు ఇచ్చాడు.

కెనడియన్ అమ్మాయి లీ ఎల్టన్‌ను ప్రేమించి పెద్దల అంగీకారంతో 2016 డిసెంబర్ 13న గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. కానీ, వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. అరుణోదయ్‌కి కుక్కలంటే చాలా ఇష్టం. ఇంట్లో చాలా పెంపుడు కుక్కలు ఉండేవి. కానీ వాటి అరుపులు, గోల లీ ఎల్టన్‌కు చిరాకు తెప్పించాయి. ఈ విషయంలో ఇద్దరి మధ్య చాలా సార్లు గొడవలు జరిగాయట. చివరికి ఆ గొడవలు బంధం తెగే వరకు లాగారు. దీంతో విడాకులు తీసుకోవడమే మంచిదని ఇద్దరూ నిర్ణయించుకుని విడిపోయారట. చూడటానికి అన్యోన్యంగా కనిపించిన ఈ జంట.. పెళ్లైన మూడేళ్లకే విడిపోయారు.