ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ లో రాజమౌళి- మహేశ్ ప్రాజెక్ట్ ఒకటి. భారీ స్థాయిలో రూపొందిస్తున్న ఈ మూవీలో అగ్ర తారలు ఇందులో భాగం కానున్నారు. అయితే తాజాగా ఓ వార్త వైరల్ అవుతుంది. ఏంటంటే.. తమిళ స్టార్ హీరో విక్రమ్ న్ను ఈ చిత్రంలో కీలకపాత్ర కోసం ఎంపిక చేయగా ఆయన ఈ ఆఫర్‌ను సున్నితంగా రిజెక్ట్ చేశారట. అది విలన్ పాత్ర కావడంతో ఆయన నో చెప్పారని సమాచారం. విక్రమ్ విలన్ రోల్ చేయకూడదని నిర్ణయించుకోవడంతో ఈ అవకాశాన్ని రిజెక్ట్ చేశారని టాక్. దీంతో ఈ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రజంట్ ఈ వార్త వైరల్ గా మారింది.
Also Read : Badshah : ఆమెతో పిల్లల్ని కంటా బ్రో.. నోరుజారిన స్టార్ సింగర్
ఇక ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతున్నప్పటికీ. ఇంతవరకు ఈ మూవీలోని ఒక్క పాత్రకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా.. ఇందులో ఆర్.మాధవన్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్టు కూడా ఇటీవల టాక్ వినిపించింది. త్వరలోనే ఆయన సెట్స్ లోకి అడుగు పెట్టనున్నట్లు ప్రచారం. ప్రజంట్ మాధవన్ కూడా డిఫరెంట్ కంటెంట్‌ను ఎంచుకుంటు మంచి మంచి సినిమాలు సిరీస్‌లో నటిస్తూ ఫామ్ లోనే ఉన్నారు. కానీ దీని గురించి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
