Site icon NTV Telugu

SSMB29 : ఆ స్పెషల్ డే రోజున బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్..?

Whatsapp Image 2024 04 24 At 8.53.10 Am

Whatsapp Image 2024 04 24 At 8.53.10 Am

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సంక్రాంతికి ”గుంటూరు కారం” సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీ మంచి విజయం  సాధించింది..ప్రస్తుతం మహేష్ తరువాత చేసే సినిమాపై ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి .మహేష్ తన తరువాత సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నాడు .ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్ గా తెలుగు సినిమా సత్తా ఏంటో నిరూపించిన రాజమౌళి తన తరువాత సినిమా ఎప్పుడు మొదలు పెడతారా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.అయితే అందరు గర్వించేలా సినిమా తీయడం మాత్రమే కాదు దాన్నిఅందరికి చేరువయ్యేలా విభిన్నంగా ప్రమోట్‌ చెయ్యడంలో కూడా దర్శకుడు రాజమౌళి భిన్నమైన శైలి కనబరుస్తారు. తన సినిమా అనౌన్స్‌మెంట్‌ వేడుకను ఎంతో గ్రాండ్ గా అందరికి గుర్తుండిపోయేలాగా నిర్వహిస్తారు.

రాజమౌళి తన సినిమా కథను కూడా లీక్ చేస్తారు.స్టోరీ లీక్ చేసిన ప్రేక్షకుడిని ఒక అద్భుతమైన మూవీని అందిస్తారు. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేస్తున్నారు.ఈ సినిమా ప్రతిష్టాత్మకమైన వరల్డ్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీగా తెరకెక్కతుంది. ఈ సినిమా కోసం మహేష్ ఇప్పటికె తన లుక్ మేకోవర్ పై పూర్తిగా దృష్టి పెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్‌ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేగంగా ఈ సినిమా ప్రీప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ వేడుకను మే 31న సూపర్‌స్టార్‌ కృష్ణ జయంతి రోజున ఘనంగా నిర్వహించడానికి నిర్మాత కేఎల్‌ నారాయణ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా రాజమౌళి టీం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టేందుకు వారు సిద్ధం అయ్యారు .

Exit mobile version