NTV Telugu Site icon

SSMB 29: రాజమౌళి – మహేశ్ ‘గరుడ’ పురాణం.. స్టోరీ ఇదే..?

Untitled Design (2)

Untitled Design (2)

మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో సినిమా రాబోతుంది అనగానే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఇన్నాళ్ళు కొంత పరిధి మేరకు మాత్రమే పరిమితమయిన మహేశ్ క్రేజ్ గ్లోబల్ లెవల్ కి వెళుతుందని, తమ హీరో ఇక నుండి గ్లోబల్ స్టార్ గా మారిపోతాడని ఘట్టమనేని ఫ్యాన్స్ అనుకున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్, రాజమౌళి సినిమాపై రకరాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ సినిమా జేమ్స్ బాండ్ తరహా నేపథ్యంలో రానుందని ఇలా ఒకటేమిటి రోజుకొక న్యూస్ వస్తుంది.

Also Read: Nani : పుష్ప -2 పోస్ట్ పోన్ పై నాని ఆసక్తికర వ్యాఖ్యలు.. అంతమాట అనేశాడేంటి..?

తాజాగా SSMB29 కు విజువల్ డెవలపర్‌గా పనిచేస్తున్న టీపీ విజయన్ ఇన్‌స్టా స్టోరీలో గోల్డ్‌ కలర్‌లో ఉన్న గద్ద రెక్కల ఫొటోను పోస్ట్‌ చేశారు. ఈ ఫోటో క్షణాల్లో వైరల్ అయింది. దీంతో SSMB29 రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘గరుడ’ అని ఎవరికీ తోచిన విధంగా వారు కథనాలు వండి వార్చారు. ఈ విషయమై రాజమౌళి టీమ్ ను సంప్రదించగా అలాంటిది ఏమి లేదని, ఆ కథ వేరు ఈ కథ వేరు అవన్నీ వట్టి రూమర్స్ అని కొట్టి పారేసారు. దీంతో ఇవన్నీ ఫేక్ న్యూస్ అని తేలిపోయాయి. త్వరలోనే ఈ సినిమా వర్క్ షాప్ స్టార్ట్ కానుందని సూపర్ స్టార్ మహేశ్ బాబు తో పాటు చిత్ర యూనిట్ మొత్తం ఈ వర్క్ షాప్ లో పాల్గొనబోతున్నారు. డిసెంబరు నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.ఈ చిత్రానికి GOLD అనే టైటిల్ పరిశీలిస్తున్నారని ఆ అర్ధం వచ్చేలా టీపీ విజయన్ పోస్ట్ చేసాడని యూనిట్ లోని కొందరు సభ్యులు తెలిపారు. మరి ఈ ఊహాగానాలాకు ఎప్పుడు తెరపడుతుందో వేచి చూడాలి.

Show comments