మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమాకు పేరు ఖరారు చేయలేదు. ‘SSMB 29’ అని ప్రస్తావించబడుతున్న ఈ చిత్రానికి సంబంధించి రాజమౌళి ఎలాంటి వివరాలు బయటకు రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయినప్పటికీ, లీకులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌లు ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది.
Read More: Manchu Mohan Babu: మోహన్‌బాబుకు సుప్రీంకోర్టు షాక్.. ఆ కేసులో స్టేకు నిరాకరణ
అదేమిటంటే, శంకర్‌పల్లిలో నిర్మించిన ప్రత్యేక సెట్లో ఈ సినిమా కోసం మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కాంబినేషన్‌లో రాజమౌళి ఒక పాటను చిత్రీకరిస్తున్నాడట. ఆ పాట చిత్రీకరణ షెడ్యూల్ ఈ రోజుతో పూర్తవబోతోందని సమాచారం. ఈ రోజు షెడ్యూల్ పూర్తవుతున్న నేపథ్యంలో మహేష్ బాబు నెల రోజుల పాటు విహారయాత్రకు వెళ్లబోతున్నారని తెలుస్తోంది. ఒకవిధంగా చెప్పాలంటే, మహేష్ బాబు పిల్లలిద్దరికీ ప్రస్తుతం వేసవి సెలవుల సమయం కావడంతో, ప్రతి సంవత్సరం వారిని ఎక్కడికో విహారయాత్రకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారు.
Read More: Nani : పహల్గాం’లో మా టీమ్ మెంబర్ ను కోల్పోయాం!
ఈ సంవత్సరం కూడా, రాజమౌళి సినిమా ఉన్నప్పటికీ, మహేష్ బాబు తన పిల్లలను విహారయాత్రకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను కేఎల్ నారాయణ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి ఈ సినిమాకు సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, లీకులు మాత్రం బయటకు వస్తూనే ఉన్నాయని చెప్పక తప్పదు.
