రాజమౌళి, మహేష్ బాబు ఫిలింపై థమన్ ఎందుకు రియాక్ట్ అయ్యాడు….? ఆ సినిమాకు కీరవాణితో పాటు తమన్ వర్క్ చేస్తున్నాడా అనే చర్చ మొదలైంది. తనది కాని సినిమా విషయంలో హీరోని, అతని లుక్ ను తమన్ ఎందుకు తన మాటలతో వైరల్ చేస్తున్నాడు..? ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ల విషయంలో సదరు సినిమాకు సంబంధంలేని టెక్నీషియన్స్ అస్సలు మాట్లాడరు. ఒకవేళ మాట్లాడితే దర్శకులు మాత్రమే రియాక్ట్ అవుతుంటారు. సంగీత దర్శకులైతే మ్యాగ్జిమమ్ కామ్ గా కూర్చుంటారు. గత కొంతకాలంగా తమన్ తాను చేయని ప్రాజెక్టుల విషయంలో సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నాడు. పుష్ప 2 విషయంలోనూ అలాగే రియాక్ట్ అయ్యాడు. కాకపోతే టైటిల్స్ లో పేరు పడకపోవడంతో అసలు తమన్ పుష్ప 2 కు ఆర్ఆర్ పరంగా ఏమైనా అగ్రిమెంట్ చేసుకున్నాడా అనిపిస్తుంది. తాజాగా తమన్ “రాజమౌళి- మహేష్” కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ పై రియాక్ట్ అయ్యాడు. అందులో ముందుగా మహేష్ లుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హాలీవుడ్ కు జేమ్స్ బాండ్, టాలీవుడ్‌కి మహేష్ బాబు అనడం ప్రిన్స్ ఫ్యాన్స్ ను ఖుషీ పడేసింది.
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసింది ఇతడే.. సీసీకెమెరా వీడియో వైరల్..
నిజానికి జక్కన్న మహేష్ తో సినిమా షురూ చేసిన దగ్గర్నుండి ఈ మూవీపై అంచనాలు పీక్స్‌లో నెలకొన్నాయి. ఈ మూవీని పాన్ వరల్డ్ మూవీగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాడు. అయితే ఆ లుక్ విషయంలో తమన్ ఇచ్చిన హింట్ చూస్తుంటే సినిమాలో లుక్ పరంగా మహేష్ ను బాండ్ తరహా గెటప్ వేయిస్తున్నాడని అర్థమవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా సినిమా వెయ్యి కోట్ల బిజినెస్ అలవోకగా చేస్తుందని.. బాక్సాఫీస్ లెక్కలు ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని థమన్ కామెంట్ చేశాడు. ఇలా SSMB29 మూవీపై థమన్ చేసిన కామెంట్స్ అభిమానుల్లో ఈ సినిమాపై బజ్‌ను అమాంతం పెంచేశాయి. ఇక సినిమా అప్డేట్స్ ఎప్పుడెప్పుడు ఇస్తారా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అలాగే థమన్ ని ఏదో రకంగా సినిమాకు వర్క్ చేయించుకుంటున్నారు అనేది తెలియాలి. ఎట్ ది సేమ్ టైమ్ ట్రెండ్లోకి వెళ్లడానికి తమన్ ఇలా కామెంట్స్ చేస్తున్నాడనేవాళ్లు ఉన్నారు.