Varanasi: ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసినా ఎలా లీక్ అవుతున్నాయి మైక్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్.ఎస్. రాజమౌళి – సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఎంత జాగ్రత్త వహిస్తున్నా.. లీకుల బెడద మాత్రం వీడటం లేదు. తాజాగా ఈ మూవీ షూటింగ్ సెట్ నుంచి కొన్ని యాక్షన్ సీన్ల వీడియోలు సోషల్ మీడియాలోకి ప్రత్యక్షమై తీవ్ర కలకలం రేపాయి..బుధవారం లీకైన ఈ తాజా క్లిప్పింగ్స్‌లో మహేష్ బాబుకు సంబంధించిన కీలకమైన యాక్షన్ సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నాణ్యత తక్కువగా ఉన్నప్పటికీ, అధికారికంగా ప్రమోషన్లు ప్రారంభించకముందే ఈ కీలక దృశ్యాలు బయటకు రావడంతో నిర్మాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అనేక సామాజిక మాధ్యమాల నుంచి ఈ వీడియోలను తొలగించినప్పటికీ, ఆలోపే అవి అభిమానుల గ్రూపుల్లో వైరల్‌గా మారాయి.
ఇంతటి భద్రతా వ్యవస్థ మరే సినిమాకు ఉండదేమో!
సాధారణంగా వారణాసి సెట్లోకి అడుగుపెట్టాలంటే ఐడీ కార్డు తప్పనిసరి. సాంకేతిక నిపుణుల నుంచి నటీనటుల వరకు ఎవరికీ సెల్ ఫోన్లను లోపలికి తీసుకెళ్లే అనుమతి ఉండదు. ప్రొడక్షన్ పరిసర ప్రాంతాల్లోకి మీడియాకు కూడా ప్రవేశం ఉండదు. పైగా నటీనటులు, పనిచేసే సిబ్బందితో కఠినమైన నాన్-డిస్క్లోజర్ అగ్రిమెంట్లపై (NDA) సంతకాలు చేయిస్తారు. టాలీవుడ్లోనే కాదు, దేశంలోనే ఇంతటి భద్రతా వలయం మధ్య చిత్రీకరణ జరుపుకునే చిత్రం మరొకటి లేదనడంలో సందేహం లేదు. అయినా సరే, ఏ షెడ్యూల్ జరిగినా ఏదో ఒక దృశ్యం నెట్టింట ప్రత్యక్షమవుతుండటం చిత్రబృందాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఐమాక్స్ (IMAX) ఫార్మాట్లో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో ప్రియాంక చోప్రా జోనాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కథ, క్యారెక్టర్ లుక్స్, విజువల్స్ రహస్యంగా ఉంచాలని భావిస్తున్న రాజమౌళి బృందానికి ఈ వరుస లీకులు పెద్ద సవాలుగా మారాయి.
Also Read
తాజావార్తలు
-
Varanasi: ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసినా ఎలా లీక్ అవుతున్నాయి మైక్?
-
Central Cabinet Decision: బయోగ్యాస్ ఉత్పత్తికి గ్రీన్‌సిగ్నల్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
-
Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
-
Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!