Site icon NTV Telugu

S S Rajamouli: బాహుబలి, RRR కాదు.. నా కెరీర్ బెస్ట్ మూవీ అదే..

Ss Rajamouli

Ss Rajamouli

తెలుగు సినిమా గర్వించదగిన దర్శకుల్లో ఎస్ ఎస్ రాజమౌళి పేరు ముందు వరుసలో ఉంటుంది. “మగధీర” నుంచి “బాహుబలి”, “RRR” వరకు వరుసగా బ్లాక్‌బస్టర్ సినిమాలతో దేశవ్యాప్తంగా ఖ్యాతి పొందిన ఆయన.. తాజాగా తన బెస్ట్ మూవీ ఏదో స్వయంగా వెల్లడించారు. రీసెంట్‌గా జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి హాజరైన రాజమౌళి, అక్కడ ఓ ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల గురించి చెబుతూ..

Also Read : Prabhas : హోంబలే నిర్మాతపై ప్రభాస్ ప్రశంసలు.

‘నా సినీ ప్రయాణంలో “మగధీర”, “సై”, “బాహుబలి”, “RRR” లాంటి హిస్టారికల్, విజువల్ వండర్స్ ఉన్నా కూడా, చిన్న ఈగ కథ ఆధారంగా తీసిన సైంటిఫిక్-ఫ్యాంటసీ థ్రిల్లర్‌ “ఈగ” సినిమానా బెస్ట్ మూవీ. ఎందుకంటే ఈగ సినిమాలోని క్రియేటివిటీ, ఎమోషనల్ కనెక్షన్, టెక్నికల్ ఎక్సలెన్స్ – ఇవన్నీ కలిసి తన దర్శక జీవితంలో అత్యంత సంతృప్తికరమైన చిత్రంగా ఇది నిలిచింది’ అని పేర్కొన్నారు. దీంతో ఫ్యాన్స్ రాజమౌళి తన బెస్ట్ మూవీగా “బాహుబలి” లేదా “RRR” చెబుతారనుకుంటే. ‘ఈగ’ అనే సమాధానం విని చాలా మంది ఆశ్చర్యపోయారు.ఒక దర్శకుడిగా తన క్రియేటివిటీకి పూర్తి స్థాయిలో న్యాయం చేసింది అనిపించిన ప్రాజెక్ట్‌గా “ఈగ”జక్కన్న అత్యంత దగ్గరగా ఉందనడంలో ఆశ్చర్యం లేదు అనిపిస్తుంది.

Exit mobile version