Rajamouli: మా అందరికీ శంకర్ రియల్ OG
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. గురువారం నాడు గేమ్ చేంజర్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ట్రైలర్ రిలీజ్ అనంతరం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ..‘ ఇది శంకర్ ఫస్ట్ తెలుగు సినిమా అని అంతా చెబుతుంటే.. అవునా? నిజమా? అని అనిపించింది. కానీ తెలుగు వాళ్లకి శంకర్ తమిళ దర్శకుడు కాదు.. మన తెలుగు దర్శకుడే. శంకర్ అంటే తెలుగు వారందరికీ గౌరవం. ఆ గౌరవంతోనే దిల్ రాజు ఈ మూవీని శంకర్ గారితో తీసి ఉంటారు. ప్రస్తుతం ఉన్న కుర్ర దర్శకులు మమ్మల్ని చూసి గర్వపడుతుంటారు.
Shankar: హాలీవుడ్ ఇండియన్ సినిమా వైపు చూస్తోంది.. శంకర్ కీలక వ్యాఖ్యలు
Also Read
- స్టార్ హీరో లేడు.. భారీ ప్రమోషన్ లేదు.. రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూ.130 కోట్లు వసూళ్లు.. Hanuman Ansh ఫుల్ స్టోరీ ఇదే!
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!
- Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
కానీ మేం మాత్రం శంకర్ గారిని చూసి గర్వపడుతుంటాం. ఆయనే డైరెక్టర్లకు ఓజీ.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. మనకున్న పెద్ద కలల్ని సినిమాగా తీస్తే.. డబ్బులు వెనక్కి వస్తాయని అందరికీ కాన్ఫిడెంట్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్. ట్రైలర్‌ను రిలీజ్ చేసే ఛాన్స్ ఇచ్చినందుకు థాంక్స్. ఈ మూవీతో వింటేజ్ శంకర్ గారెని చూస్తాం. ఒకే ఒక్కడు నాకు చాలా ఇష్టమైన సినిమా. ఆ స్థాయిని మించేలా గేమ్ చేంజర్ ఉంటుందనిపిస్తుంది. ట్రైలర్ చూస్తే.. ప్రతీ షాట్, సీన్ ఎగ్జైట్మెంట్‌ను ఇచ్చింది. మగధీర నుంచి ఆర్ఆర్ఆర్‌కే రామ్ చరణ్ ఎంతో ఎదిగి పోయాడు. మగధీర టైంలోరామ్ చరణ్‌ను హీరో అని పిలుస్తూ ఉండేవాడ్ని. హెలికాప్టర్ నుంచి లుంగీ కట్టుకుని కత్తి పట్టుకుని దిగుతుంటే.. విజిల్స్ ఎలా వస్తాయో నాకు తెలుస్తోంది. జనవరి 10న థియేటర్లోకి గేమ్ చేంజర్ రాబోతోంది. అందరూ థియేటర్లో చూడండి’ అని అన్నారు.
తాజావార్తలు
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
Telangana Assembly: మహిళా పోలీసుల విధులకు ఆటంకం.. కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురిపై మరో కేసు
-
Ujjain: 170 ఏళ్ల హనుమంతుడి విగ్రహం.. రెండు రోజులు ప్రయత్నించినా అంగుళం కూడా కదల్లేదు!
-
BCCI Partners: బీసీసీఐతో చాట్‌జీపీటీ, క్యాంపా, ఎస్బీఐ లైఫ్ ఒప్పందం.. రూ.130 కోట్లకు పైగా డీల్!
-
2.5K డిస్‌ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!