SS Karthikeya Directed a Short Film Starring Niharika and Akhil: రాజమౌళి కుమారుడు కార్తికేయ దర్శకత్వంలో నాగబాబు కుమార్తె నిహారిక హీరోయిన్గా నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ హీరోగా ఒక షార్ట్ ఫిలిం తెరకెక్కిందట. అయితే ఈ షార్ట్ ఫిలిం చూసిన తర్వాత దీని రిలీజ్ చేయకుండా ఉండడమే మంచిది అని రాజమౌళి అభిప్రాయ పడడంతో అది ప్రేక్షక లోకానికి తెలియలేదట. ఈ విషయం చెప్పింది ఇంకెవరో కాదు స్వయంగా నిహారిక. ఆమె కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాతో నిర్మాతగా సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూస్ లో ఒక దానిలో ఈ విషయం బయట పెట్టింది.
Naga Chaitanya: నాగ చైతన్య-శోభితల పెళ్లి ముహూర్తం ఇదే.. డెస్టినేషన్ వెడ్డింగ్ అక్కడే!
నిజానికి విశ్వక్సేన్ దినేష్ నాయుడుగా ఉన్నప్పుడు నిహారికతో కలిసి ఒక షార్ట్ ఫిలిం చేశాడు. కానీ అది రిలీజ్ అవ్వలేదు. ఆ విషయాన్ని ప్రస్తావించగా అది ఆ సంగతి పక్కన పెడదాం నేను అఖిల్ తో కూడా ఒక షార్ట్ ఫిలిం చేశాను దాని దర్శకుడు రాజమౌళి గారి కుమారుడు కార్తికేయ అని నిహారిక చెప్పుకొచ్చింది. అంతేకాదు తనకు యాక్టింగ్ అంటే అప్పుడు చాలా పిచ్చి ఉండేదని అప్పుడు తన పళ్లకు బ్రేసెస్ ఉండేవి కానీ ఈ షార్ట్ ఫిలిం కోసమని ఆ బ్రేసెస్ కూడా తొలగించాను అంటూ ఆమె అప్పటి సంగతులను గుర్తు చేసుకుంది. అయితే ఆ షార్ట్ ఫిలిం బాగా రాకపోవడంతో రాజమౌళి సూచనలు మేరకు బయటకు రిలీజ్ చేయలేదని ఆమె చెప్పుకొచ్చింది. అదండీ సంగతి.
