KGF తో కెరీర్ ఆరంభంలోనే పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకుంది శ్రీనిధి శెట్టి. రీసెంట్‌గా ‘హిట్ 3’తో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన శ్రీనిధి శెట్టి, ఈ దీపావళి జొన్నలగడ్డ, రాశీ ఖన్నా నటిస్తున్న ‘తెలుసు కదా’ చిత్రంతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నీరజ్ కోన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నది ఈ మూవీ ఈ నెల 17న విడుదల కానుంది. రిలీజ్ టైం దగ్గరపడుతుండటంతో టీం ప్రమోషన్స్ పనులు మొదలు పెట్టింది. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ అలరిస్తున్నారు. ఇందులో భాగంగా..
Also Read : Niharika NM: యూట్యూబ్ నుంచి సిల్వర్ స్క్రీన్ దాకా.. నిహారిక ఎన్‌ఎం సక్సెస్ స్టోరీ
శ్రీనిధి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘తెలుసు కదా’ సినిమా రొమాంటిక్ డ్రామా అయినప్పటికీ, ఇది సాధారణ ప్రేమకథ కాకుండా వినూత్న అంశాలతో రూపొందించబడింది. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి చుట్టూ తిరిగే కథ అనుకుంటే ప్రతి ఒక్కరూ సాధారణ ప్రేమకథ అని భావిస్తారు. కానీ ఈ చిత్రంలో ఓ ప్రత్యేకమైన అంశాన్ని చూపించాం. తెరపై చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. మా మూడు పాత్రలు ప్రేక్షకులతో బాగా కనెక్ట్ అవుతాయి. నేను రాగ్ అనే పాత్రలో నటిస్తున్నాను. ఈ పాత్రలో నా నిజ జీవితానికి కొన్ని పోలికలు ఉన్నాయి, యాక్టర్‌కి అన్ని విభాగాలపై పట్టు ఉండటం ఎంత అవసరమో నేర్చుకున్నా. సిద్ధు జొన్నలగడ్డ కామెడీ టైమింగ్ బాగుంటుంది, రాశీ ఖన్నా క్రమశిక్షణ గా ఉంటారు. సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా నటనతో కథ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా తర్వాత ప్రేక్షకులు మంచి రొమాంటిక్ డ్రామా అనుభూతి పొందుతారు. నాకు విభిన్నమైన పాత్రలు చేయాలని ఉంది. ప్రస్తుతం వెంకటేశ్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌లో నా పాత్ర ఏమిటో నాకు తెలియదు, అవకాశం రావాలని కోరుకుంటున్నా కానీ కొంత గ్రే షేడ్ కూడా ఉంది” అని శ్రీనిధి వివరించింది.
