Site icon NTV Telugu

Srinidhi Shetty : గ్లామర్ నుంచి నటన దిశగా.. మారుతున్న శ్రీనిధి జర్నీ!

Srinidhi Shetty

Srinidhi Shetty

శ్రీనిధి శెట్టి .. చేసినవి, చేస్తున్నవి పెద్ద సినిమాలే అయినా కెరీర్ ఆశించిన రీతిలో ముందుకెళ్ల లేకపోతుంది. భారీ హిట్ అయిన KGF లో ఆమె పాత్ర ఎక్కువగా గ్లామర్ పరంగా ఉండటంతో, ఆమె నటనకు తగిన ప్రాధాన్యత రాలేదు. తర్యాత ఆమె తమిళంలో ‘కోబ్రా’ అనే సినిమాతో అరంగేట్రం చేసింది. ఈ ప్రాజెక్టులు ఆమెకు పెద్దగా బ్రేక్ తీసుకు రాలేకపోయారు. కానీ రీసెంట్‌గా ఆమె నటించిన ‘HIT 3’ లో మాత్రం తన నైపుణ్యాన్ని నిరూపించే అవకాశం దక్కించుకుంది.

Also Read : Kajal : మళ్లీ ఫామ్‌లోకి కాజల్.. ఏకంగా బోల్డ్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్!

కానీ ఏం లాభం.. బహుళ భాషల్లో మాట్లాడగలగడం, ప్రమోషన్లలో చురుకుదనం చూపడం వంటి గుణాలు ఉన్నా కూడా, ఆమెకు స్క్రిప్ట్ పరంగా బలమైన పాత్రలు లభించలేదు. ఇక ఇప్పటికి శ్రీనిధి చేతిలో పెద్దగా ప్రాజెక్టులు లేనప్పటికీ, ఆమెను కొన్ని ఆసక్తికరమైన సినిమాల కోసం సంప్రదిస్తున్నట్టు సమాచారం. వాటిలో ఒకటి తమిళ స్టార్ అజిత్‌తో చేయబోయే చిత్రం కావడం గమనార్హం. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాతో, అజిత్‌తో పని చేసిన దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ఈ మూవీలో శ్రీనిధిని హీరోయిన్‌గా తీసుకునే ప్లాన్ లో ఉన్నారని సినీ వర్గాల టాక్.

అజిత్ లాంటి స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే శ్రీనిధికి కెరీర్ మరోసారి ఫామ్ లోకి వచ్చినట్లే. కానీ కంటెంట్ బేస్డ్ రోల్స్‌లో నటిస్తే ఆమె టాలెంట్ మరింత వెలుగులోకి వస్తుంది. మాస్ మార్కెట్‌కు ఓన్ అయ్యే సినిమా కన్నా, కథానాయకి పాత్రకు బలం ఉన్న చిత్రాలను ఎంచుకుంటే మంచిది. అందుకే శ్రీనిధికి ఇండస్ట్రీలో స్థిరమైన గుర్తింపు రావాలంటే, సరైన కథలు, పాత్రలు ఎంపిక చేయడమే కాకుండా, తాను చేసే ప్రతీ సినిమాతో తన టాలెంట్‌ను మరో మెట్టు ఎక్కించడం చాలా కీలకం.

Exit mobile version