Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ డైలాగులు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి

Srinidhi Shetty News

Srinidhi Shetty News

త్రివిక్రమ్ సినిమా అంటేనే డైలాగుల జాతర. ప్రాసల కోసం కాకుండా, జీవిత సత్యాలను అత్యంత సింపుల్‌గా చెప్పడం ఆయన స్టైల్. అయితే ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు రాసినట్లుగా కాకుండా.. ‘ఆదర్శ కుటుంబం’ లాంటి డార్క్ క్రైమ్ కామెడీకి ఆయన రాసిన డైలాగులు మునుపెన్నడూ లేనంత పదునుగా, ఇంటెన్స్‌గా ఉన్నాయని హీరోయిన్ శ్రీనిధి శెట్టి చెబుతోంది. ఆ క్రైమ్ ప్రపంచంలో ఆయన రాసిన సంభాషణలు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయని అంటోంది.

ముఖ్యంగా ట్రైలర్‌లో ఉన్న “చచ్చే సైన్యం లేకుండా గెలిచే యుద్ధం ఏది సార్?” అనే డైలాగ్ తనకు మాత్రమే కాదు, అందరికీ విపరీతంగా నచ్చేసిందని ఆమె తెలిపింది. ప్రతి డైలాగ్‌లోనూ ఎంతో లోతైన భావం ఉంటుందని, అందుకే తానూ ప్రతి డైలాగ్ వెనుక అర్థాన్ని తెలుసుకుని నటించే ప్రయత్నం చేశానని వెల్లడించింది. ఇక డైరెక్టర్‌గా త్రివిక్రమ్ సెట్‌లో ఉన్నప్పుడు క్రియేట్ చేసే వాతావరణం అద్భుతమని.. ఆయన మాట్లాడుతుంటే అందరూ ఎందుకు అలా మంత్రముగ్ధులై వింటూ ఉండిపోతారో తనకు ఆయనను కలిశాకే అర్థమైందని శ్రీనిధి ప్రశంసల వర్షం కురిపించింది.