Srinidhi Shetty: వెంకటేష్ కామెడీ టైమింగ్‌ను మ్యాచ్ చేయడం నా వల్ల కాలేదు 

Srinidhi Shetty

Srinidhi Shetty

టాలీవుడ్‌లో కామెడీ టైమింగ్ అనగానే గుర్తొచ్చే మొదటి పేరు విక్టరీ వెంకటేష్. ఆయన కామెడీకి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు. అలాంటి వెంకటేష్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడం యువ నటీనటులకు ఒక రేంజ్‌లో సవాల్ విసురుతుంది. ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’లో ఆ సవాల్‌ను ఎదుర్కొన్న శ్రీనిధి శెట్టి, షూటింగ్ సెట్స్‌లో తన అనుభవాలను నిజాయితీగా పంచుకుంది. డార్క్ కామెడీ పండించడం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

వెంకటేష్ లాంటి కామెడీ కింగ్‌తో నటించడం మామూలు విషయం కాదని, ఆయన టైమింగ్‌ను మ్యాచ్ చేయడం అసాధ్యమని ఆమె ఓపెన్‌గా ఒప్పేసుకుంది. “ఆయన కామిక్ టైమింగ్, ఎమోషనల్ యాక్టింగ్ ముందు ఎవరైనా సరిపోరు. నేను నా కెరీర్‌లో తొలిసారి పూర్తి స్థాయి కామెడీ రోల్ చేస్తున్నాను. త్రివిక్రమ్ గారి రైటింగ్, వెంకటేష్ గారి పెర్ఫార్మెన్స్ కలిస్తే ఆ సీన్స్ చాలా నాచురల్‌గా వస్తాయి. ఆ సహజత్వంలో నేను ఇమిడిపోవడానికి తీవ్రంగా ప్రయత్నించాను. దర్శకుడు త్రివిక్రమ్ గారి సూచనల వల్లే ఆ కామెడీ సన్నివేశాల్లో నేను కూడా నాచురల్‌గా నటించగలిగాను” అని శ్రీనిధి తెలిపింది.