NTV Telugu Site icon

SYG : శ్రీకాంత్ పవర్‌ఫుల్ లుక్ రిలీజ్..

Bollywood,abhishek Bachchan,aishwarya (2)

Bollywood,abhishek Bachchan,aishwarya (2)

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో సాయి దుర్గా తేజ్ కూడా ఒకరు. చివరగా ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా. అందులో ‘విరూపాక్ష’ బాగా ఆడింది. ‘బ్రో’ అంతగా ఆడలేదు. ఇక ప్రస్తుతం రోహిత్ దర్శకత్వంలో తేజు ‘సంబరాల ఏటిగట్టు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘హనుమాన్’ ఫేమ్ నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దీనికోసం ఏకంగా రూ.120 కోట్లు బడ్జెట్ పెడుతున్నారని వినికిడి. పాన్ ఇండియా సినిమా కావడంతో పెద్ద పెద్ద ఎత్తున సెట్స్ కూడా వేస్తున్నారట. అయితే ఈ మూవీలో సీనియర్ యాక్టర్స్ చాలా మంది నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ..

Also Read :Pooja Hegde : క్యారెక్టర్‌ కోసం ఎంతో కష్టపడతాం.. కానీ మా పేర్లు ఉండవు

ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించి వరుస చిత్రాలతో అలరిస్తున్నాడు. కాగా ఇప్పుడు తేజ్ మూవీ లో కూడా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు శ్రీకాంత్. ఇక ఈ రోజు ఆయన బర్త్ డే కావడంతో. SYG మూవీ టీం శ్రీకాంత్ సంబంధించిన ఫోటో ఒకటి విడుదల చేశారు. ఇప్పటికే జగపతి బాబు, అలాగే సాయి కుమార్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా. వీళ్లతో పాటు పక్క భాషలకు చెందిన సీనియర్ హీరోలు, హీరోయిన్లు కూడా ఈ ప్రాజెక్టులో భాగం కానున్నారట. ఇక శ్రీకాంత్ ఈ లుక్ లో చాలా వైలెంట్‌గా కనిపించాడు.