NTV Telugu Site icon

Srikanth Iyengar : క్షమాపణలు కావాలా.. అయితే వేచివుండండి

Srikantnh

Srikantnh

టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచుకున్నారు శ్రీకాంత్ అయ్యంగర్ అలియాస్ శ్రీకాంత్ భరత్. రీసెంట్ గా వచ్చిన సరిపోదా శనివారం, తాజాగా విడుదలైన పొట్టెల్ సినిమాలోను నటించి మెప్పించారు. శ్రీకాంత్ అయ్యంగర్ పొట్టెల్ సక్సెస్ మీట్ సక్సెస్ మీట్ లో రివ్యూ రైటర్స్ పై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో పెను దుమారం రేపాయి. జీవితంలో షార్ట్ ఫిల్మ్ తీయడం చేతకాని నా కొడుకులు కూడా రివ్యూ రాస్తున్నారు. సినిమా తీయడం ఎంత కష్టమో రఫ్ ఐడియా లేని నా కొడుకులు వాళ్ళుఅంటూ తీవ్ర స్థాయిలో మాట్లాడారు.

Also Read : LuckyBaskhar : తడిసిన కళ్ళతో, నవ్వుతున్నపెదాలతో థియేటర్ నుంచి బయటకు

మరోవైపు శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు ఫిర్యాదు చేసింది. శ్రీకాంత్ వ్యాఖ్యలను మీడియా తీవ్రంగా ఖండిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. శ్రీకాంత్‌ అయ్యంగార్‌ మాటలు జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి అని ఫిల్మ్‌ క్రిటిక్స్ అసోసియేషన్‌ ఫిర్యాదులో పేర్కొంది. ఈ వివాదంపై మరోసారి స్పందిస్తూ తాజగామరో వీడియో రిలీజ్ చేసారు శ్రీకాంత్. ఆ వీడియోలో మాట్లాడుతూ ‘ నమస్కారం నేను భరత్ శ్రీకాంత్, పొట్టెల్ సినిమా సక్సెస్ మీట్ లో నేను కొన్ని మాటలు మాట్లాడాను దాంతో కొందరికి నేను భాద కలిగించును. త్వరలో మీ అందరికి కరెక్ట్ విషయాల మీద బేషరతు క్షమాపణ ఇవ్వబోతున్నాను. దయచేసి వేచి ఉండండి’ అని అన్నారు. ఆ వీడియోపై శ్రీకాంత్ అయ్యంగార్ క్షమాపణ చెప్తాను అనేలా లేదు.. ఇంకేదో గెలుకుతాను రెడీగా ఉండండి అన్నట్టుంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Show comments