NTV Telugu Site icon

Srikanth Iyengar: నన్ను ప్లీజ్ క్షమించండి, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది!

Srikanth Iyengar Comments

Srikanth Iyengar Comments

క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గా సినిమాలు చేస్తూ వస్తున్నా శ్రీకాంత్ అయ్యంగార్ తెలుగులో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయారు. ఇటీవల కాలంలో రిలీజ్ అయిన చాలా సినిమాలలో శ్రీకాంత్ అయ్యంగార్ ఉండాల్సిందే అనేట్టుగా రాసుకుంటున్నారు కొత్త డైరెక్టర్ లు. బ్రోచేవారుఎవరురా, ‘సామజవరగమన’, భలే ఉన్నాడే. రీసెంట్ గా వచ్చిన సరిపోదా శనివారం, తాజాగా విడుదలైన పొట్టేల్ సినిమాలో కూడా నటించి మెప్పించారు శ్రీకాంత్ అయ్యంగార్. పొట్టేల్ సక్సెస్ మీట్ సక్సెస్ మీట్ లో రివ్యూ రైటర్ల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత సినీ జర్నలిస్టుల నుంచి నిరసన వ్యక్తం కావడంతో రివ్యూయర్స్ పై తాను చేసిన వ్యాఖ్యలపై నటుడు శ్రీకాంత్‌ అయ్యంగార్‌ స్పందించారు. త్వరలోనే క్షమాపణలు చెబుతానని అంటూ వీడియో విడుదల చేశారు.

Amaran: అమరన్ సినిమాలో ముకుంద్ వరదరాజన్ కులం ఎందుకు చూపించలేదు?.. డైరెక్టర్ ఏమన్నారంటే?

కొన్ని మాటలు అని కొంత మందికి బాధ కలిగించాను. త్వరలో అందరికీ కరెక్ట్‌ విషయాలపై బేషరతు క్షమాపణలు చెబుతా, దయచేసి వేచి ఉండండి” అని వీడియోలో పేర్కొన్నారు. ఆ వీడియో రిలీజ్ చేసి చాలా కాలమైంది అయినా ఇప్పటివరకు క్షమాపణలు చెప్పలేదు. ఇక తాజాగా నిన్న రాత్రి ఆయన మరో వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ అందరికీ నమస్కారం నేను మీ శ్రీకాంత్ భారత్, కొన్ని రోజుల క్రితం క్షమాపణ కోరుతున్నాను అని చెప్పి త్వరలో విడుదల అని చెప్పాను. నన్ను ప్లీజ్ క్షమించండి, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది అండి నేను ఇంకా బేషరతు క్షమాపణ కోరలేదు. త్వరగా విడుదల అండి అంటూ మరోసారి క్షమాపణ చెప్పి చెప్పనట్టుగానే ముగించారు.

Show comments