NTV Telugu Site icon

Sri vishnu : శ్రీ విష్ణుది చూసి ఆశ్చర్యపోతున్న సినీ వర్గాలు…ఇంతకీ ఏమిటది…?

Untitled Design (1)

Untitled Design (1)

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ ప్రయాణం మొదలుపెట్టాడు శ్రీ విష్ణు. సన్నాఫ్ సత్యమూర్తి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి పలు చిత్రలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించాడు విష్ణు. అతిధి పాత్రలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని హీరోగా మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ వంటి చిత్రాలతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు. చిన్న హీరోగా స్టార్ట్ అయ్యి నేడు మిడ్ రేంజ్ హీరోలలో విభిన్నమైన నటనతో మెప్పిస్తూ మంచి మార్కెట్ ను ఏర్పరుచుకొని, సినిమా సినిమాకు మార్కెట్ పెంచుకొని సినీ వర్గాలను ఆశర్యపరుస్తున్నాడు శ్రీ విష్ణు.

ఇటీవల వరుస హిట్లతో సూపర్ ఫామ్ లో ఉన్నాడు ఈ హీరో. రాజ రాజ చోర చిత్రంతో శ్రీ విష్ణు మార్కెట్ అమాంతం పెరిగింది. మధ్యలో అల్లూరి ప్లాప్ అయినా కూడా మినిమం కలెక్టన్స్ రాబట్టాడు. ఆ వెంటనే వచ్చిన సామజవరగమన సినిమాతో కెరీర్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టాడు ఈ యుంగ్ హీరో. ఓ బీమ్ బుస్ తో సక్సెస్ ట్రాక్ కొనసాగించాడు. ప్రస్తుతం స్వాగ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు శ్రీ విష్ణు. షూటింగ్ దశలో ఉండగానే మంచి థియేట్రికల్ బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి ఈ చిత్రానికి. కాగా స్వాగ్ చిత్రం ఆడియో రైట్స్ ఇటీవల అమ్ముడయ్యాయి. బాలీవుడ్ దిగ్గజ మ్యూజిక్ సంస్థ టిప్స్ తెలుగు ఈ చిత్రం రైట్స్ కొనుగోలు చేసింది. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి నేడు మిడ్ రేంజ్ హీరోలలో మంచి మార్కెట్ ఏర్పాటుచేసుకున్నాడు. శ్రీ విష్ణుతో సినిమాల చేస్తే మినిమం గ్యారెంటీ అనే ఉద్దేశంతో ఈ యంగ్ హీరోతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు.ప్రస్తుతం పీపుల్స్ మీడియా నిర్మిస్తోన్న స్వాగ్ తో పాటు జీ స్టూడియోస్ నిర్మించబోయే రాజా రాజా చోర -2 చిత్రంలో హర్షిత్ గోలి దర్శకత్వంలో నటిస్తున్నాడు కుర్ర హీరో శ్రీ విష్ణు.

Also Read: Prabhas kalki: ఎట్టకేలకు దిగొచ్చిన కల్కి..!

Show comments