Site icon NTV Telugu

Sri vishnu : శ్రీవిష్ణు ‘సింగిల్’ రిలీజ్ డేట్ ఫిక్స్..

Single, Sri Vishnu

Single, Sri Vishnu

టాలీవుడ్‌‌లో మంచి గుర్తింపును సంపాదించుకున్న యంగ్ హీరోలో శ్రీ విష్ణు ఒకరు. కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించిన విష్ణూ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. దీంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే  వరుస పెట్టి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక చివరగా శ్రీ విష్ణు , ఆసిత్ గోలీ దర్శకత్వంలో రూపొందిన ‘స్వాగ్’ అనే సినిమాతో రాగా. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఈ మూవీలోని శ్రీ విష్ణు నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

Also Read: Ar Rahman : మళ్ళి ఇరకాటంలో పడ్డా ఏఆర్ రెహ‌మాన్‌..

కాగా ప్రస్తుతం శ్రీ విష్ణు ‘సింగిల్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియో, సింగిల్ సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకోగా. తాజాగా ఈ మూవీ ఆఫీషియల్ రిలీజ్ డేట్‌ని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని మే 9న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రజంట్ ఈ పోస్టర్ వైరల్ అవుతుంది.

Exit mobile version