NTV Telugu Site icon

Game Changer: గేమ్ ఛేంజర్ డబ్బింగ్ వర్క్ స్టార్ట్.. రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా..?

Untitled Design (92)

Untitled Design (92)

రామ్ చరణ్ తాజా చిత్రం గేమ్ ఛేంజర్. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరక్కుతోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. తెలుగులో శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న తొలి సినిమా ఇదే. త‌మిళ స్టార్ ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజు ఈ సినిమాకు క‌థ‌ను అందించారు. ఇందులో రామ్‌చ‌ర‌ణ్‌కు సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇటీవల వల విడుదలైన ఫస్ట్ సింగిల్ ఫ్యాన్స్ కు సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.

Also Read: Vijay Sethupathi: తెలుగులోకి విజయ్ సేతుపతి బ్లాక్ బస్టర్ సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?

భారతీయుడు -2 కారణంగా గేమ్ ఛేంజెర్ షూటింగ్ చివరి షెడ్యూల్ పెండింగ్ లో ఉంది. రామ్ చరణ్ కు సంబంధించి వారం రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది. ఇదిలా ఉండగా గేమ్ ఛేంజెర్ డబ్బింగ్ పనులను నేడు శబ్దాలయ డబ్బింగ్ స్టూడియోలో పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు నిర్మాత దిల్ రాజు. ఇందుకు సంబంధించి పోస్టర్ రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ రి స్టార్ట్ కానుందని తెలుస్తోంది. మరోవైపు ఈ గేమ్ ఛేంజెర్ ఎడిటింగ్ పనులను చెన్నైలో స్టార్ట్ చేసే ఏర్పాట్లలో ఉన్నాడు దర్శకుడు శంకర్. పొలిటికల్ సెటైరికల్ నేపథ్యంలో రానున్న ఈ సినిమాపై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు, RRR వంటి సూపర్ సక్సెస్ తర్వాత రానుండంతో ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నారు. త్వరలోనే ప్రమోషన్స్ కార్యక్రమాలు ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. దాదాపు రూ. 200 కోట్లబడ్జెట్ తో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాను డిసెంబరు 20న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. రిలీజ్ డేట్ పై అధికార ప్రకటన మరి కొద్దీ రోజుల్లో రానుంది.

Show comments