NTV Telugu Site icon

Sri Murali : పాన్ ఇండియా హిట్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా

Srimurali

Srimurali

పాన్ ఇండియన్ హీరోగా మారేందుకు చేసిన ఫస్ట్ ప్రయత్నమే బెడిసి కొట్టింది. స్టార్ దర్శకుడు కథ ఇచ్చినా రిజల్ట్ రివర్సైంది. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా మార్కెట్ రేంజ్ పెంచుకునేందుకు రెడీ అయ్యాడు. అప్ కమింగ్ ప్రాజెక్టుల విషయంలోనూ అదే ఫాలో అవుతున్నారు. యష్ తరహాలో తన ఫస్ట్ ఫిల్మ్ హీరో శ్రీ మురళిని పాన్ ఇండియా హీరోను చేసేందుకు గట్టిగానే ప్రయత్నించాడు ప్రశాంత్ నీల్. బఘీరకు కథను అందించాడు. గత ఏడాది అక్టోబర్ చివరిలో రిలీజైన ఈ సినిమా కన్నడిగులు తప్ప.. మరెవ్వరూ తలెత్తి చూడలేదు. దీంతో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

Also Read : Mollywood : క్రేజీ ప్రాజెక్ట్స్ ఖాతాలో వేసుకుంటోన్న ‘ప్రేమలు’ ఫేం నస్లేన్

గ్లోబల్ లెవల్ స్టార్ డమ్ తెచ్చుకుందామకున్న శ్రీమురళి ఆశలపై స్వయానా నీల్ మామే నీళ్లు కుమ్మరించినట్లైంది. బఘీర రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా ఫైట్ చేస్తున్నాడు రోరింగ్ స్టార్ శ్రీమురళి. ఎలాగో రిస్క్ చేశాం కాబట్టి అదే కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు. అప్ కమింగ్ ప్రాజెక్ట్ పరాక్ కూడా భారీ స్థాయిలో భారీ బడ్జెట్ ఖర్చు పెట్టిస్తున్నాడట. మార్చిలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ సెట్ అయ్యాడు. న్యూ టాలెంట్, సప్త సాగరాలు దాచే ఎల్లో ఫేం చరణ్ రాజ్ కంపోజర్ గా ఫిక్స్ అయ్యాడు. పరాక్ కాకుండా శ్రీ మురళి చేతిలో మరో క్రేజీయెస్ట్ ప్రాజెక్టు ఉంది. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో మరో మూవీని చేస్తున్నాడు. చూడబోతే ఇది కూడా భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోన్నట్లు సమాచారం. మరీ తన మార్కెట్ పెంచుకుని, బాక్సాఫీస్ బెండు తీయాలని ఆశపడుతున్న శ్రీ మురళి  ఎలాంటి సక్సెస్ కొడతాడో చూడాలి.