Site icon NTV Telugu

Karan Johar : మరో బాలీవుడ్ సినిమాలో శ్రీ లీల.?

Sri Leela

Sri Leela

2008లో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ దోస్తానా. అభిషేక్, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశాడు కరణ్‌ జోహార్. 2019లో కార్తీక్ ఆర్యన్, జాన్వీ, లక్ష్య హీరో హీరోయిన్లుగా దోస్తానా సీక్వెల్ ఎనౌన్స్ చేశాడు ప్రొడ్యూసర్. కానీ కరణ్- కార్తీక్ ఆర్యన్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఈ సినిమాతోనే లక్ష్యను ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాడు కరణ్.

Also Read : Sri Vishnu : #సింగిల్ డే – 2 సాలిడ్ రన్.. మొత్తం ఎంత రాబట్టిందో తెలుసా.?

కార్తీక్ ఆర్యన్‌తో ఇష్యూ వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు అదే కార్తీక్ ఆర్యన్‌తో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు తెరకెక్కిస్తున్నాడు కరణ్. ఈ క్రమంలోనే  దోస్తానా 2ను తిరిగి సెట్స్ పైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు. కార్తీక్ ప్రాజెక్టును నుండి ఔట్ కాగా, లక్ష్య ఈ సీక్వెల్ మూవీలో కొనసాగుతున్నాడు. 12thఫెయిల్ ఫేం విక్రాంత్ మాస్సే ఈ వెంచర్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే హీరోయిన్ మార్చేయబోతున్నాడన్న టాక్ నడుస్తోంది. తొలుత ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ కోసం జాన్వీ కపూర్ ను తీసుకున్నాడు కరణ్. అది ఆరేళ్ల క్రితం ముచ్చట. ఇప్పుడు కార్తీక్ ప్లేస్ లో లక్ష్య వచ్చి చేరాడంతో హీరోయిన్ కూడా మార్చినట్టు టాక్.  జాన్వీ ప్లేసులోకి డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీలను తీసుకోవాలని కరణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జాన్వీ రోల్‌ను ఆమె దక్కించుకుందని లేటెస్ట్ ముంబయి టాక్. దోస్తానా 2లో శ్రీలీల పేరు కార్తీకే రిఫర్ చేశాడని టాక్. మరీ కరణ్ జోహార్  ఫ్యామిలీ మెంబర్ లాంటి జాన్వీని కాదని.. శ్రీలీలకు ఛాన్స్ ఇస్తాడా మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.

Exit mobile version