Sreeleela: తమిళనాడు కోడలిగా శ్రీలీల..? తాజా కామెంట్స్ హాట్ టాపిక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్ అగ్ర హీరోలందరి సరసన నటించి స్టార్‌డమ్ తెచ్చుకున్న శ్రీలీల, ప్రస్తుతం కోలీవుడ్ బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా చెన్నైలోని అమృత ఏవియేషన్ కాలేజ్ ఈవెంట్‌లో బ్రాండ్ అంబాసిడర్‌గా పాల్గొన్న ఆమె, విద్యార్థులతో ముచ్చటిస్తూ తన వ్యక్తిగత, సినీ జీవితం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఈ ఈవెంట్‌లో విద్యార్థులు శ్రీలీలను ఉద్దేశించి ‘లేడీ సూపర్ స్టార్’ అని నినాదాలు చేయగా, ఆమె సున్నితంగా ఆ ట్యాగ్‌ను తిరస్కరించారు.. ‘నాకు ఇష్టమైన నటి నయనతార. ఆమె మాత్రమే అసలైన లేడీ సూపర్ స్టార్. ఆమె నాకు రోల్ మోడల్. ఆ స్థాయికి చేరుకోవడానికి నాకు ఇంకా చాలా సమయం పడుతుంది’ అని తన వినయాన్ని చాటుకున్నారు. అలాగే, ఓటమికి భయపడకుండా ప్రయత్నిస్తూనే ఉండాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఇదే వేదికపై తన పెళ్లి గురించి శ్రీలీల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి..
Also Read
‘చెన్నై కుర్రాళ్లు చాలా స్వీట్. ఇక్కడి దోశ అంటే నాకు చాలా ఇష్టం. నయనతార గారి లాగే నేను కూడా చెన్నైలోనే పెళ్లి చేసుకుంటానా అనేది ఇప్పుడే చెప్పలేను’ అని ఆమె నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఈ మాటలతో శ్రీలీల తమిళనాడు కోడలిగా వెళ్లనున్నారా? లేదా అప్పుడే ఎవరితోనైనా ప్రేమలో పడ్డారా? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ధనుష్ సరసన నటిస్తున్న శ్రీలీల, బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్ మూవీతో పలకరించనున్నారు.
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!