Sreeleela: శ్రీలీల – తిలక్ వర్మ రిలేషన్‌షిప్‌పై షాకింగ్ ట్విస్ట్..!

Tilak Varma, Sreeleela

Tilak Varma, Sreeleela

టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. బాలీవుడ్‌లోనూ క్రేజీ ప్రాజెక్టులతో బిజీ అవుతున్న యంగ్ బ్యూటీ శ్రీలీల.. ఉన్నట్టుండి ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మతో డేటింగ్‌లో ఉందంటూ నెట్టింట ఒక వార్త షికారు చేస్తోంది. ఐపీఎల్ సీజన్ నడుస్తున్న తరుణంలో ఈ గాసిప్ మరింత హాట్ టాపిక్‌గా మారింది.శ్రీలీల సోషల్ మీడియాలో తిలక్ వర్మను ఫాలో కావడం ఈ అనుమానాలకు ప్రధాన కారణమైంది. దీంతొ నెటిజన్లు కొన్ని చిన్న విషయాలను ఒకదానికొకటి లింక్ చేస్తూ ఈ క్రేజీ గాసిప్‌ను క్రియేట్ చేశారు. అయితే, తాజాగా శ్రీలీల సన్నిహిత వర్గాలు ఈ పుకార్లపై ఘాటుగా స్పందించి, అసలు నిజాన్ని బయటపెట్టారు.

ఇటీవల ముంబై ఇండియన్స్ ఆడిన ఒక మ్యాచ్‌లో శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణలత స్టేడియంలో ముంబై జట్టుకు సపోర్ట్ చేస్తూ కనిపించారనే ప్రచారం జరగడంతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఈ వార్తలు నెట్టింట వైరల్ అయిన నేపథ్యంలో క్రికెటర్ తిలక్ వర్మ కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ విషయంలో మరింత జాగ్రత్త (Care) తీసుకోవడం ప్రారంభించడంతో.. నెటిజన్లు వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ పుకార్లు హద్దులు దాటుతుండటంతో శ్రీలీల టీమ్ ఈ విషయంపై స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది.. ‘తిలక్ వర్మ, శ్రీలీలల గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు..

అవి పూర్తిగా అబద్ధం బేస్ లెస్. అసలు వీరిద్దరూ తమ జీవితంలో ఎప్పుడూ వ్యక్తిగతంగా కలుసుకోలేదు, కనీసం ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు కూడా. కేవలం సోషల్ మీడియాలో వచ్చే కొన్ని విషయాలను బట్టి ఇలాంటి కల్పిత కథలు ప్రచారం చేయడం సరైనది కాదు’ ప్రస్తుతం శ్రీలీల తన కొత్త సినిమాల షూటింగులతో పాటు తన కెరీర్‌పైనే పూర్తి దృష్టి పెట్టింది. అటు తిలక్ వర్మ కూడా క్రికెట్ మ్యాచులతో బిజీగా ఉన్నారు. ఇద్దరూ తమ తమ రంగాలలో కెరీర్ బిల్డింగ్‌పైనే ఫోకస్ పెట్టారని, ఈ డేటింగ్ వార్తలు కేవలం కొందరు సృష్టించిన పుకార్లేనని క్లారిటీ వచ్చేసింది.