Site icon NTV Telugu

Sreeleela :24 ఏళ్ల వయసులోనే గొప్ప నిర్ణయం తీసుకున్న శ్రీ లీల..

Sreelela

Sreelela

కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా కూడా కొంత మంది నటినటులు నిజ జీవితంలో చాలా దయ హ‌ృదయంతో ఉంటారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో బ్యూటిఫుల్ లేడీ శ్రీ లీల ఒకరు. వెండితెరపై తన డ్యాన్స్ మరియు నటనతో ప్రేక్షకులను అలరించే ఈ ముద్దుగుమ్మ, నిజ జీవితంలో తన సేవాగుణం తో అందరి మనసు గెలుచుకుంది కేవలం 24 ఏళ్ల వయసులోనే ఆమె ముగ్గురు పిల్లలను దత్తత తీసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : Priyanka Jain : సీరియల్స్ మానేయడానికి ఆ భయమే కారణం..

2022 లో గురు, శోభిత అనే ఇద్దరు దివ్యాంగ పిల్లలను దత్తత తీసుకున్న శ్రీలీల, గత ఏడాది (2025 ఏప్రిల్‌) మరో చిన్నారిని తన కుటుంబంలోకి ఆహ్వానించారు. అయితే తాజాగా ఈ దత్తత విషయంపై స్పందిస్తూ..‘ఆ పిల్లల గురించి మాట్లాడేటప్పుడు నాకు మాటలు రావు, చాలా ఎమోషనల్ అవుతాను. నేను వారికి కేవలం సాధారణ అమ్మలా మాత్రమే ఉండను, మా మధ్య ఒక ప్రత్యేకమైన బంధం ఉంది’ అని శ్రీలీల తెలిపారు.

తన తొలి సినిమా ‘కిస్’ షూటింగ్ సమయంలో ఒక ఆశ్రమానికి వెళ్లినప్పుడు ఆ పిల్లలతో ఏర్పడిన అనుబంధమే ఈ గొప్ప నిర్ణయానికి కారణమట. ఈ విషయాన్ని ఇన్నాళ్లు రహస్యంగా ఉంచినప్పటికీ, సంస్థ నిర్వాహకుల కోరిక మేరకు మరికొందరిని ప్రేరేపించాలనే ఉద్దేశంతో ఇప్పుడు బయటపెట్టినట్లు ఆమె వెల్లడించారు. స్టార్ హీరోయిన్‌గా బిజీగా ఉంటూనే, ఒక తల్లిగా ఆ పిల్లల బాధ్యతలను భుజాన వేసుకున్న శ్రీ లీల నిజంగా అభినందనీయురాలు.

Exit mobile version