Comrade Kalyan : శ్రీవిష్ణు టైమింగ్, దర్శకుడి టేకింగ్.. సైలెంటుగా పని పూర్తి చేసిన ‘కామ్రేడ్ కళ్యాణ్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో తొలి సినిమాతోనే సక్సెస్ అందుకోవడం అందరికీ సాధ్యం కాదు. తాజాగా ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాతో దర్శకుడు జానకిరామ్ మారెళ్ల ఆ అరుదైన ఘనతను సాధించారు. అయితే, ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించడంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది హీరో శ్రీవిష్ణు గురించి, అలాగే సినిమాలో అద్భుతంగా వర్కౌట్ అయిన కామెడీ గురించి. ఈ సినిమాను శ్రీవిష్ణు తన భుజాలపై వేసుకుని నడిపించాడనే చెప్పాలి. తనదైన మార్క్ కామెడీ టైమింగ్‌తో సినిమాకు ప్రధాన బలంగా నిలిచాడు శ్రీవిష్ణు. దర్శకుడు రాసుకున్న సింపుల్ వన్‌లైనర్స్, సహజమైన సంభాషణలను శ్రీవిష్ణు తెరపై పండించిన విధానం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఎక్కడా అసహజంగా అనిపించకుండా, సందర్భానుసారంగా వచ్చే కామెడీ థియేటర్లలో వర్కౌట్ అవ్వడం సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్.
ఇక దర్శకుడు జానకిరామ్ మారెళ్ల విషయానికొస్తే.. తొలి సినిమానే అయినా శ్రీవిష్ణు లాంటి హీరో బలాన్ని, ఆయన కామెడీ టైమింగ్‌ను వాడుకోవడంలో అతను పూర్తిగా సక్సెస్ అయ్యాడు. కథను వినోదాత్మకంగా చెప్పడమే కాకుండా, కమర్షియల్ అంశాలను కూడా బాగా డీల్ చేశాడు. తన గురువు, ప్రముఖ దర్శకుడు బాబీ స్టైల్లో యాక్షన్ సన్నివేశాలను రిచ్ విజువల్స్‌తో ప్రెజెంట్ చేసి టేకింగ్‌లో తనకున్న స్కిల్‌ను నిరూపించుకున్నాడు. ఓ వైపు శ్రీవిష్ణు ఎంటర్టైన్మెంట్ అదరగొట్టడం, దానికి తోడు దర్శకుడు యాక్షన్, కామెడీని ఎక్కడా బోర్ కొట్టకుండా బ్యాలెన్స్ చేయడంతో ‘కామ్రేడ్ కళ్యాణ్’ కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా నిలిచింది. మొత్తానికి శ్రీవిష్ణు కామెడీ టైమింగ్‌తో సినిమా హిట్ అవ్వడమే కాకుండా.. దర్శకుడు జానకిరామ్ మారెళ్లకు కూడా తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో మంచి బ్రేక్ దొరికింది. ఇప్పుడు కామెడీ సినిమాలు చేసే దర్శకులు తక్కువయ్యారు. దర్శకుడు ఇదే బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే దర్శకుడిగా అతనికి టాలీవుడ్లో మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది.
Also Read
- RAPO 23: టాలీవుడ్లోకి రితీష్ దేశ్ ముఖ్
- Vijay Deverakonda: యాక్షన్‌కు బ్రేక్.. ఫ్యామిలీ ఆడియన్స్ కోసం విజయ్ దేవరకొండ కొత్త ప్లాన్!
- Vishwak Sen: తాజుద్దీన్‌కు క్షమాపణలు.. అందుకే 'కల్ట్' సినిమాకు నేనే దర్శకత్వం వహిస్తున్నా!
- Bollywood: రోహిత్, రణ్వీర్, టైగర్ ష్రాఫ్.. బాలీవుడ్లో మళ్లీ అండర్‌వరల్డ్ నీడలు.. దడ పుట్టిస్తున్న బిష్ణోయ్ గ్యాంగ్..
తాజావార్తలు
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!
-
Mydukur Election Suspended: మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు రద్దు.. ఎస్ఈసీ కీలక ప్రకటన
-
Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కేవలం 45 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్..!
-
RAPO 23: టాలీవుడ్లోకి రితీష్ దేశ్ ముఖ్
-
Chris Gayle Catch: 47 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. గాల్లోకి ఎగిరి స్టన్నింగ్ క్యాచ్.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే!
ట్రెండింగ్
-
Cinnamon Plant: మార్కెట్ దాల్చిన చెక్కకు గుడ్ బై.. ఇంట్లోని కుండీలోనే సులువుగా పెంచేయండిలా..
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?