Deewana: సినిమా నచ్చి బై వన్ గెట్ వన్ ఆఫర్ ప్రకటించిన హీరో శ్రీ విష్ణు

Deewana

Deewana

Deewana: దీవాన ‘థ్యాంక్యూ మీట్’కు గెస్ట్‌గా విచ్చేసిన హీరో శ్రీవిష్ణు ఆడియెన్స్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ఈ హీరోకి దీవాన చిత్రం బాగా నచ్చడంతో.. రేపు శనివారం దీవాన మూవీ ఆడుతున్న ప్రతి థియేటర్‌లో మొదటి పాతిక టికెట్లకు “ఒకటి కొంటే మరొక టికెట్ ఉచితం” అనే ఆఫర్ ప్రకటించేశాడు. దీంతో ఈ సినిమా ఇక మరింత ఎక్కువ మందికి రీచ్ అయ్యి, అటు మౌత్ పబ్లిసిటీతో పాటు, ఇటు సినిమా చూసిన వాళ్లు ఇచ్చే పాజిటివ్ రివ్యూతో సినిమాకు మంచి థియేట్రికల్ రన్ లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక తనతో ‘సింగిల్’ చిత్రాన్ని నిర్మించిన లేడీ ప్రొడ్యూసర్ విద్య కొప్పినీడి కోరిక మేరకు, నిన్న సినిమా ఫస్ట్ హాఫ్ చూసిన ఈ హీరో.. ఇంటర్వెల్‌లో వచ్చిన ట్విస్ట్‌కి ఒక్కసారిగా చిప్ ఎగిరిపోయి, పనులు మానుకొని మరీ సెకండ్ హాఫ్ చూడడం జరిగిందని దీవాన థ్యాంక్యూ మీట్ వేదికగా ఈ కామెడీ హీరో వెల్లడించారు. అలాగే ఈ మూవీ తీసిన దర్శకుడికి ఎంత టాలెంట్ ఉందో, అంతే టాలెంట్ ఉన్న టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్స్ దొరకడంతో సినిమా చాలా బాగా వచ్చిందని; ఒకానొక సందర్భంలో సినిమాలోని పాత్రల మీద సైతం కోపం వచ్చిందని, అలా అన్ని సినిమాలకు జరగదని, మనం సినిమాను ఫీల్ అయినప్పుడే అది జరుగుతుందని, ఆ ఫీల్ తనకు ఈ దీవాన చిత్రంతో సంపూర్ణంగా కలిగిందని హీరో శ్రీవిష్ణు అన్నారు.

అలాగే ఈ మూవీని నిర్మించిన వాసుదేవ్ కొప్పినీడి, శ్రీదేవి కార్యంపూడి నిర్మాతలకు ‘గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ వంటి దిగ్గజ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తోడవడం సినిమాకు మరింత కలిసొచ్చే అంశంగా మారిందని ఆయన అన్నారు. హీరో హర్షిత్ రెడ్డి నటన ఈ చిత్రంలోనే కాదు, అతను యాక్ట్ చేసే ప్రతి చిత్రంలోనూ చాలా న్యాచురల్ గా ఉంటుందని అన్నారు. ఇక ఈ మూవీలో హీరోకి ఫ్రెండ్ పాత్ర పోషించిన శివరామ్ శంకర్.. గతంలో తనను సినిమా ఛాన్స్ అడిగేందుకు వస్తే చదువుకుని రమ్మని చెప్పి పంపించడం జరిగిందని, ఇప్పుడు ఆ అబ్బాయి హిట్ కొట్టి నా ముందు నిలబడ్డాడు కాబట్టి ఫ్యూచర్‌లో తనకు మంచి అవకాశం ఇస్తానని హీరో శ్రీవిష్ణు అన్నారు.