రెబల్ స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పిరిట్’. పాన్ ఇండియా రేంజ్‌లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో శరవేగంగా సాగుతోంది. నగరంలోని ప్రముఖ సింగిల్ స్క్రీన్ ఐకాన్ ‘విమల్ థియేటర్’లో గత రెండు రోజుల క్రితం ఒక కీలకమైన షెడ్యూల్ షూట్ ఫినిష్ చేసారు. ఈ షూటింగ్‌లో హీరో ప్రభాస్ కూడా జాయిన్ అయ్యారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాను ఊపేస్తోంది. ‘స్పిరిట్’ మూవీలోని ఒక పవర్‌ఫుల్ డైలాగ్ లీక్ అయినట్లుగా నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. “చట్టాన్ని ఫాలో అవ్వను.. నేనే చట్టం“ అనే డైలాగ్ ఇప్పుడు ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ డైలాగ్ నిజంగా సినిమాలో ఉందా లేదా అనేది పక్కన పెడితే.. ప్రభాస్ కటౌట్‌కు సందీప్ రెడ్డి వంగ ఇంటెన్సిటీకి ఈ లైన్ పక్కాగా సెట్ అవుతుందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ ఒక్క డైలాగ్ వింటేనే సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఎంత రఫ్ అండ్ రూత్‌లెస్‌గా ఉండబోతుందో అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ మునుపెన్నడూ చూడని ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రి నటిస్తుండగా విలన్‌గా వర్సటైల్ యాక్టర్ వివేక్ ఓబరాయ్ నటిస్తున్నారు. ప్రభాస్ కాకీ యూనిఫామ్ వేసి సందీప్ మార్క్ యాక్షన్‌తో థియేటర్లలోకి వస్తే బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
